ఆదర్శ ఉపాధ్యాయుడు

మరీ ముఖ్యంగా, ఆయన చివరి పదేళ్ళ కాలంలో ఆయన్ని చాలా దగ్గరగా చూసినవాళ్ళు కలాం ఎన్నటికీ స్వయంగా చెప్పుకోడానికి ఇష్టపడని ఎన్నో అపురూపమైన సంగతుల్ని మనముందుకు తెస్తున్నారు. ఆ విశేషాలు మనం ప్రతి ఒక్కరం తెలుసుకోదగ్గవి, ముఖ్యం, మన పిల్లలతో పదే పదే చదివించదగ్గవి.

ఒక విజేత ఆత్మకథ

భారతరాష్ట్రపతిగా పనిచేసిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, రక్షణవ్యవహారాల నిపుణుడు, దార్శనికుడు డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం తన జీవితయానాన్ని వివరిస్తూ రాసుకున్న ఆత్మకథ Wings of Fore కు వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన తెలుగు అనువాదం