యుగయుగాల చీనా కవిత-13

వెన్ అంటే వాక్కు, కవిత్వం, సాహిత్యం, కళ, కావ్యకళ కూడా. 'గొప్ప అంధకారం ఆవరించిన ప్రపంచంలోకి కవిత్వం వెలుగు తీసుకొస్తుంది' అని లు-జి నమ్మాడు. గొడ్డలి పిడిని మరొక గొడ్డలితో చెక్కినట్టుగా కవిత్వాన్ని చూసి కవిత్వమెలా రాయాలో నేర్చుకుంటాం అని చెప్పాడు.

యుగయుగాల చీనా కవిత-12

ప్రాచీన చైనాలో అంత అందగాడు మరొకడు లేడని పేరు తెచ్చుకున్నవాడు. చాలాకాలం ప్రభుత్వంలో ఉన్నతోద్యోగాలు చేసాడు. పదవీ విరమణ చేసాక లొ-యాంగ్ శివార్లలో ఉన్న తన సుక్షేత్రానికి పోయి తోటల మధ్యా, పొలాల మధ్యా గడపాలనుకున్నాడు.