
9
మళ్ళీ యాభై ఏళ్ళ తరువాత
అదిలాబాద్ జిల్లా విద్యాచరిత్రలో, ముఖ్యంగా అక్కడి గిరిజన విద్యా చరిత్రలో 93-94 చారిత్రాత్మక విద్యాసంవత్సరమని చెప్పాలి. అప్పటికి సరిగ్గా ఏభయ్యేళ్ల కిందట 1943లో మొదటిసారిగా నిజాం ప్రభుత్వం గోండు విద్యా పథకాన్ని ప్రవేశపెట్టింది. కావడానికి అది నిజాం ప్రభుత్వపు పథకమే అయినప్పటికీ దానిమీద గాంధేయ విద్యావిధానపు ముద్ర సుస్పష్టంగా ఉంది.
గాంధీజీ విద్యాకార్యక్రమాన్ని ప్రజాజీవితానికి సన్నిహితంగా తీసుకు వెళ్లాలనీ, దానితో ఉత్పాదక శ్రమకు చోటివ్వాలనీ, అది కేవలం పుస్తక విద్య కాకుండా జీవిత దృక్పథాన్నిచ్చే సమగ్ర విద్య కావాలనీ పరితపించారు. నిజాం ప్రవేశపెట్టిన గోండు విద్యాపథకం ముఖ్య లక్షణాల్ని చూస్తే మనకీ అంశం బాగా బోధపడుతుంది. అందులో ముఖ్యాంశాలు ఇవి : అ) ఉపాధ్యాయశిక్షణా కేంద్రాల ఏర్పాటు ద్వారా, గ్రామీణ పాఠశాలల ద్వారా, వయోజనులకు అక్షరాస్యతా కేంద్రాల ద్వారా విద్యావ్యాప్తి, అందుకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రి ఉచిత పంపిణీ, ఆ) స్ధానిక గిరిజన పురాగాథలు, సంప్రదాయాలు, జానపదగేయాలు సేకరణ, ముద్రణ, అంతేకాక లిపి లేని గిరిజనభాషల్ని లిఖితరూపానికి తీసుకురావడం, వాటిని కూడా విద్యాసంబంధ సాహిత్యంగా పరిగణించడం.
దీనిలో భాగంగానే మొదట మార్లవాయిలో, ఆ తరువాత గిన్నెధరిలో ఉపాధ్యాయశిక్షణా కేంద్రాల్ని ఏర్పాటు చేసి గోండు యువతీ యువకులు ఉపాధ్యాయులుగా పాఠశాలల్ని పెద్ద ఎత్తున తెరిచారు. అటువంటి పాఠశాలలు, నడిపిన గోండు యువతీయువకులు, నేను ఉత్నూరు వెళ్లేనాటికి వృద్ధులయినవారిని, కొందరిని చూసాను.
వారిలో చివరి ఉపాధ్యాయిని శంభుబాయి నేను వెళ్లిన తరువాత కూడా చాలరోజులు ఉత్నూరు బాలికల వసతి గృహానికి మేట్రన్‌గా పనిచేసేది. ఒకప్పుడు మార్లవాయిలో ఆమెకి నేర్పిన మరాఠీ మీడియం చదువు కాలక్రమంలో ఆమెకి నిరుపయోగంగా మారిపోయింది. మారిన పరిస్ధితుల్లో ఆమె దాదాపుగా నిరక్షరాస్యురాలిగానే ఉండేది. కానీ, విలువల విషయంలో, ఆత్మస్థైర్యం విషయంలో, క్రమశిక్షణ విషయంలో ఆమె సర్వీసులో చివరిదాకా కూడా తక్కినవారికి ఆదర్శంగానే ఉండేది.
నిజాం ప్రభుత్వం చేపట్టిన గోండువిద్యా సంస్కరణలు నైపుణ్యాలను ఇవ్వడంతో అపకుండా మట్టిని మాణిక్యాలుగా మార్చాయనడానికి మరొక ఉదాహరణ గిన్నెధరికి చెందిన మారు మాష్టారు. ఆయనతో నాకు లభించిన సమావేశాలు సంఖ్యల్లో ఎక్కువ కాకపోయినప్పటికీ, వాటి ద్వారా ఆత్మవిశ్వాసపూరితుడైన గోండును నేను చూడ గలిగాను.
ఏకోపాధ్యాయపాఠశాలల్లో కృత్యాధార విద్యనీ, ఆశ్రమపాఠశాలల్లో కరికులం సంస్కరణల్నీ మేం ప్రవేశపెట్టామనుకునేకంటే యాభయ్యేళ్ల గిరిజన చరిత్రలో అప్పటికి అటువంటి సంస్కరణల అవసరం మరొకసారి కావలసివచ్చిందనుకోవడం సముచిత మనిపిస్తుంది. పోనీ, మేం ప్రకటించిన, ప్రచారం చేసిన భావాలు ఆ నేలకి కొత్తవా అనుకుంటే, గాంధేయ మౌలిక విద్యను కనీసం రెండు దశాబ్దాల పాటు అమలుచేసిన అనుభవం అదిలాబాదుకుందని కూడా మనం మర్చిపోకూడదు.
అసలు గాంధీజీ ఆశయాలు ఆ ప్రాంతానికి కొత్తవా అని ప్రశ్నిస్తే, ఒకప్పటి నిఆజాం రాజ్యంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలో అప్పటికే ఎన్నో ఏళ్లుగా దళితుల విద్యకోసం ఎన్నో ఉద్యమాలు, ఆలోచనా తరంగాలు రేకెత్తుతూనే ఉన్నాయని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
అటువంటి ప్రజాజీవితపు పునాదుల మీద నిర్మించబడే విద్య ఎలా ఉంటుందో అదిలాబాద్‌లో రవీంద్రకుమార్‌శర్మ నడుపుతున్న కళాశ్రమం ఇప్పటికీ సజీవ ఉదాహరణ. అందరూ గురూజీ అని పిలిచే శర్మగారు యావద్భారతదేశంలోనే అపురూపమైన వ్యక్తి. కాయిక శ్రమనీ, ఆత్మిక జాగృతినీ మేళవించిన భారతీయ గురుకులాలకు ఆయన ప్రత్యక్షనిరూపణ. అటువంటి విద్యను మనం మనుషుల్ని రూపొందించే విద్య అనవచ్చు. అది ఎలా ఉంటుందో డా.రాధాకృష్ణన్ మాటల్లో వివరించవచ్చు.
మనిషిని ఉన్నతతర ఆత్మికజీవితంలోకి ప్రవేశపెట్టడమే భారతదేశంలో అనాది నుంచీ విద్యాలక్ష్యంగా ఉంటూ వచ్చింది. విద్యార్ధిని మహత్తర ఆత్మికపథికుడుగానే భారతీయవిద్య భావిస్తూ వచ్చింది. అటువంటి ఆత్మవికాసానికి విద్య కట్టుబడి ఉండాలన్నది ఇక్కడి విద్యాలక్ష్యం. దాన్ని వివేకంగా పేర్కొనవచ్చు.
వివేకమంటే కేవల గ్రంథపరిజ్ఞానం కాదు. అది జ్ఞానాన్ని ఆచరణాత్మకంగా బోధపరుచుకోవడం. ఛాందోగ్యోపనిషత్‌లో నారదుడు సనత్కుమారుడితో మాట్లాడుతూ తను అన్ని పరిజ్ఞానాల్నీ సంపాదించాననీ, కానీ పూర్తి జ్ఞానిని మాత్రం కాలేకపోయాననీ, ఒప్పుకుంటాడు. నారదుడు చెప్పిందేమంటే ‘అయ్యా, మంత్రవేత్తను మాత్రమే కాగలిగి, ఆత్మవేత్తను కాలేకపోయిన విషాదం నాది. దీన్నుంచి నన్ను బయటపడవెయ్యగల మార్గాన్ని ఉపదేశించు’ అని.
మంత్రవేత్త అంటే టెక్నాలజీని సాధించినవాడూ, బహు పుస్తకపరిజ్ఞానాన్ని సాధించినవాడూ అనుకుంటే, ఆత్మవేత్త అంటే తన పట్ల అవగాహన కలిగినవాడూ, ఆత్మనిర్భరత్వాన్ని సాధించినవాడూ అని మనం అనుకుంటే అటువంటి ఆత్మవేత్తల్ని రూపొందించగల విద్య రవీsదరకుమారశర్మది.
బరోడా విశ్వవిద్యాలయం నుంచి శిల్పశాస్త్రంలో పట్టభద్రుడైన శర్మగారు శిల్పకళా రహస్యాలు ఔపోశన పట్టిన వ్యక్తి. ఆయన మరే చోటా ఉద్యోగానికి పోకుండా, అదిలాబాద్‌లోనే కుమ్మర్లు, తాపీపనివారు, వెదురుపనివారు, సున్నం పనివారు, నేతపనివారు, కొలిమిపనివారు మొదలైన వృత్తి పనివారలతో కలిసి జీవించడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా అదిలాబాద్‌లో మా సంస్ధ నడుపుతున్న కొలాం ఆశ్రమ పాఠశాలలో కొలాము పిల్లలతో బొమ్మలు గీయిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన వృత్తి అదే.
తక్కిన రోజంతా తన ఆశ్రమంలో చేతివృత్తుల వారి గురించీ, వారి మీద ఆధారపడ్డ గ్రామస్వరాజ్యానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వల్ల ఏర్పడిన విఘాతం గురించీ, వరదలాగా ముంచెత్తుతున్న ఈ వస్తువ్యామోహం గురించీ తనదగ్గరకి వచ్చిన ప్రతివారికీ అవగాహన కల్పించడమే ధ్యేయంగా జీవిస్తూ ఉన్నారు.
గాంధీజీ ప్రవచించిన బేసిక్ ఎడుకేషన్ మీద ఆధారపడి నడిచిన పాఠశాలలు ఎలా ఉంటాయో నేను చూడలేదు. కానీ, గురూజీ కళాశ్రమం పూర్తి గాంధేయవాద పాఠశాల అనడంలో నాకు సందేహం లేదు.
ఇంత చరిత్ర ఉన్నప్పటికీ, ఇన్ని ఉదాహరణలు తమ కళ్ల ముందు ఉన్నప్పటికీ, నేను ప్రవేశపెట్టిన సమగ్రవిద్యాప్రణాలికను వ్యతిరేకించడంలో ఏ ఒక్క వర్గమూ వెనకబడలేదు. చివరికి గిరిజన యువత కూడా మా సంస్కరణల్ని తొందరపాటు చర్యలుగా పేర్కొంటూ, మేం గిరిజన పాఠశాలలను విద్యా ప్రయోగశాలలుగా మార్చేస్తున్నామని విమర్శించారు.
ఏ పాఠశాలైనా విద్యా ప్రయోగశాలగా మారిందంటే దాన్ని నిజానికి ప్రశంసా వాక్యంగానే నేను పరిగణిస్తాను. ఆ రోజులన్నీ నేను గిజుభాయి భడేచా రాసిన ‘దివాస్వప్న’ చదివాను. అతడు తన తరగతిగదినొక విద్యా ప్రయోగశాలగా మారుస్తానన్నప్పుడు అతని పాఠశాలల ఇన్‌స్పెక్టర్ అతన్ని నమ్మి అందుకు అనుమతిస్తేనే అది సాధ్యమయిందని మనం మర్చిపోకూడదు.
ఏ పాఠశాలకైనా తనకి అనుకూలమైన కరికులంని ఎంచుకునే స్వేచ్ఛ ఉండాలని కొఠారి కమిషన్ కూడా అన్నది. భీతావహవాతావరణాన్ని తమ చుట్టూ కల్పించుకుంటూ, మమ్మల్ని వ్యతిరేకించే ఉద్దేశ్యంతో ముందుకు నడుస్తున్న వివిధ శక్తులకూ, వర్గాలకూ ఈ తార్కికతా, హేతుబద్ధతా ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఆ శక్తులు మా ప్రయత్నాల వెనక ఉద్దేశ్యాల్నీ, మా సంకల్పాన్నీ ఏనాడూ నమ్మలేదు. ఉపాధ్యాయ వ్యతిరేకతతోనే మేం వివిధ సంస్కరణల్ని చేపడుతూ వచ్చామని అవి భావిస్తూ, అటువంటి రుజువు కోసం నిరీక్షిస్తూ ఉన్నాయి.
చివరికి ఆరోజు రానే వచ్చింది. ఒకరోజు నేను ఉత్నూరు నుంచి కేస్లాపూర్ మీదుగా ఇచ్చోడ ప్రయాణిస్తూ ఉన్నాను. ఆ అడవిదారిలో రాయిగూడ అనే గ్రామంలో మా ఆశ్రమ ఉన్నతపాఠశాల ఒకటుంది. నేను ఆ ఆశ్రమ పాఠశాలని చేరేటప్పటికి బాగా పొద్దుపోయి చీకటి పడింది. నేను ఆ రాత్రికి నిర్మల్ వెళ్లి అక్కడ బస చెయ్యవలసి ఉంది కాబట్టి రాయిగూడలో ఆగాలని గాని, ఆ పాఠశాలని చూడాలని గాని అనుకోలేదు.
కాని ఆ రాత్రి ఆ పాఠశాల పరిస్ధితి నన్నక్కడ నిలవరించింది. అప్పుడా పాఠశాలలో కరెంటు లేదు. అంతా అంధకారబంధురంగా ఉంది. ప్రధానోపాధ్యాయుడు గాని, మరే సీనియర్ ఉపాధ్యాయులు గాని అక్కడ లేరు. వాళ్లు ప్రతిరోజూ అక్కడికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అదిలాబాద్ నుంచి పొద్దున్నే వచ్చి సాయంకాలం వెళ్లిపోతున్నారని తెలిసింది.
నిజానికి ఆ ప్రధానోపాధ్యాయుణ్ణి మేం అతనికోరిక మీదనే అక్కడ నియమించాం. అటువంటిది, అతడు కూడా అక్కడ నివాసముండటం లేదని తెలియడం నన్ను నిస్సత్తువకు గురిచేసింది. పైగా ఆ ఆశ్రమపాఠశాలకు అప్పటికి వారంరోజులుగా కరెంటు లేదనీ, అయినా ప్రధానోపాధ్యాయుడు ఏమీ చర్య తీసుకోలేదనీ గ్రామస్ధులు చెప్పారు. అతని బాధ్యతారాహిత్యం నన్ను బాధపెట్టింది.
మేం ఒక వైపు సమూల సంస్కరణల గురించి మాట్లాడుతున్నాం. మరొక వైపు ఒక ఉన్నతపాఠశాల ఉపాధ్యాయుడు కనీస బాధ్యతల్ని కూడా నిర్వహించకుండానే కాలం గడుస్తోంది. ఆ బాధ్యతారాహిత్యాన్ని శిక్షించకుండా వదిలిపెడితే అది బాధ్యతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అన్యాయం చేయడమే అవుతుందని పించింది.
మర్నాడు ఉత్నూరు రాగానే మా ప్రాజెక్టు అధికారితో ఆ అంశం చర్చించాను. అతణ్ణి వెంటనే బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించాం. అప్పటికే టెర్మినేషన్‌కి గురయిన గిరిజన ఉపాధ్యాయులు సంస్ధ కార్యాలయం ముందు నిరాహారదీక్షలు చేస్తున్నారు. అటువంటి వాతావరణంలో ఒక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుణ్ణి సస్పెండ్ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు అంతదాకా చెప్తూ వచ్చినదంతా నిజమవుతున్నట్టే ఉపాధ్యాయులు భావించారు. వారిలో అగ్రహం, నిరసన ప్రజ్వరిల్లాయి.
మేమిచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వుల్ని వెనుతీసుకొమ్మని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి ఇచ్చాయి. రాయబారాలు నడిచాయి. అది తప్ప తక్కినదేదైనా అంగీకరిస్తానని ప్రాజెక్టు అధికారి భీష్మించుకుకూచున్నారు. చివరికి ఆఖరి అస్త్రంగా అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సంయుక్త ధర్నాకి పిలుపునిచ్చాయి. జిల్లా నలుమూలల్నించి అందరు ఉద్యోగులకీ, ఉపాధ్యాయులకీ ‘ఉత్నూరు ఛలో’ పిలుపు వెళ్లింది.
ధర్నా రేపనగా, దాన్ని నివారించడానికి మరొక్కసారి ఉపాధ్యాయసంఘాలు ప్రాజెక్టు అధికారితో సమావేశమయ్యాయి. చివరగా ఆ సాయంకాలానికి ప్రధానోపాధ్యాయుణ్ణి బాధ్యతలలోకి తిరిగి తీసుకోవడానికి అంగీకారం కుదిరింది. అతన్ని తిరిగి రాయిగూడలో నియమించడానికి మాత్రం ప్రాజెక్టు అధికారి ఒప్పుకోలేదు. అతణ్ణ్ణి నార్నూరు మండలంలోని మారుమూల గ్రామమైన గాదిగూడలో తిరిగి నియమించారు. ఆ ఒక్క అంశం మీదా పట్టువిడుపులు చూపడానికి ఇరువర్గాలూ ఇష్టపడలేదు.
చివరికి, ఆ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు తమ ధర్నాను విరమించకుండా మరునాడు కొనసాగించడానికే నిశ్చయించాయి. ప్రాజెక్టు అధికారి మాత్రం తమ చర్చల సారాంశాన్ని నోటీసుబోర్డులో తగిలించి ఆ రాత్రే హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఆ మర్నాడు ధర్నా తీవ్రతరంగా ఉంటుందనీ, అందుకనీ నన్నూ, శశిధర రావుగార్నీ కూడా ఎక్కడికయినా కేంప్ వెళ్లిపొమ్మని ఆఫీసులో సలహా ఇచ్చారు. శశిధరరావుగారు ఆ మాట పాటించి కేంప్ కెళ్లిపోయారు. నేను అలా ఎక్కడికీ వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ, కనీసం ఆఫీసుకి మాత్రం రావద్దని ఆఫీసులో మరీ మరీ చెప్పడంతో ఇంటివద్దనే ఉండిపోయాను.
ఆ మర్నాడు ఉదయం పదకొండు గంటలు దాటింది. నేనూ, నా భార్యా మా వీధి చివరన ఉన్న ఆంజనేయస్వామి గుడికి వెళ్లాలని బయటకు వచ్చాం. మేము వీథి మలుపు తిరిగామో లేదో దూరంగా పెద్ద ఊరేగింపు కనబడింది. వందలాది ఉపాధ్యాయులతో, ఉద్యోగులతో కూడుకున్న ఆ ఊరేగింపు అనూహ్యంగా మేమున్న వీథి వైపే తిరిగింది. అది అలా నడుచుకుంటూ, నడుచుకుంటూ మా వైపే వస్తున్నదని నాకు అర్ధమయింది.
అది సాధారణంగా ఊరేగింపులకు అనుమతించే వీధి కాకపోయినప్పటికీ, అక్కడనేను కనబడినందువల్లనే అగ్రహంతో ఆ ఊరేగింపు మేమున్న వీథి వైపు తిరిగిందని కూడా నాకు బోధపడింది. ఆ క్షణాన్న నేనేం చేయాలో నాకు బోధపడ లేదు. అక్కడ తలదాచుకోవడానికి ఏ నీడా లేదు. ఇక చేసేదేమీ లేక, నేనూ నా భార్యా ఆ రోడ్డు పక్కనే అలా నిలబడిపోయి ఉన్నాం.
చివరికి ఆ ఊరేగింపు మా దగ్గరకు వచ్చింది. అక్కడ ఆగింది. అందులో ఉన్నది వందలాది ఉపాధ్యాయులు. వారి ముఖాల్లో తీవ్ర అగ్రహం, కరడు గట్టిన ఏహ్యత, ధిక్కారం, నిరసన, ఎన్నో భావాలు ప్రస్ఫుటమవుతున్నాయి. వారక్కడ నిలబడి నన్ను రకరకాలుగా దూషించారు. నా వైపు తిరిగి ఉమ్మేసారు. ఛీకొట్టారు. అరిచారు. కేకలేసారు. గుండెలు బాదుకున్నారు. నేను మౌనముద్రతో వాళ్లనే చూస్తూ ఉండగా, ఇంతలో పరుగు పరుగున పోలీసు బలగం అక్కడికి చేరుకుంది. వారి మందలింపులకు, ఆదిలింపులకు ఊరేగింపు ముందుకు కదిలింది.
ఆ సాయంకాలం పెద్ద ఎత్తున ఉత్నూరులో బహిరంగ సభ జరిగింది. ఉపాధ్యాయ సంఘాల, ఉద్యోగ సంఘాల రాష్ట్రనాయకులు అక్కడ ప్రసంగాలు చేసారు. విద్యాప్రణాళికను తగలబెట్టమని పిలుపునిచ్చారు.
నేను ఆ రాత్రంతా ఆలోచిస్తూ గడిపాను. అగ్రహంతో, అసహ్యంతో నన్ను నిందిస్తున్న ఉపాధ్యాయుల వదనాలే నాకు పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. వారిలో కేవలం బడికి వెళ్లని వారు మాత్రమే లేరు. వారిలో బడికి వెళ్లేవారు. అంకిత భావంతో పనిచేసేవారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆ ఊరేగింపు మొదట్లోనే జెండా పట్టుకుని దారి తీసిన వారిలో గంగాధర్ కూడా ఉన్నాడు.
సంస్ధ ఉపాధ్యాయుల్లో అత్యున్నత వ్యక్తిత్వాన్ని కలిగిన ఉపాధ్యాయుల్లో గంగాధర్ ముందు నిలుస్తాడు. నేను ఉత్నూరు వెళ్లిన కొత్తలో అతడు తిర్యాణి మండలం లోని మారుమూల కొలాం గ్రామమైన దంతన్ పల్లిలో పనిచేస్తుండేవాడు. అతడి సేవానిరతకి, నిర్భయత్వానికీ ముగ్ధులు కానివారు లేరు. అటువంటి ఉపాధ్యాయుడు సంస్ధకి చేరువలో ఉండాలన్న ఉద్దేశ్యంతో నేను అతణ్ణి ఏరికోరి ఉత్నూరు బాలికల పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా నియమించుకున్నాను.
అటువంటి గంగాధర్ ఆ రోజు నిరసన ప్రదర్శనలో అగ్రభాగాన్న నిల్చున్నాడు. ఎందుకు జరిగిందిట్లా? నేను చేసిన తప్పేమిటి? ఆత్మావలోకనంతో ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. చివరికి ఆ ప్రశ్న నేరుగా గంగాధర్‌నే వెళ్లి అడగాలను కున్నాను. ఆ రాత్రంతా ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూడటంతోనే గడిచి పోయింది నాకు.
9
Again After 50 years
In the educational history of Adilabad district—particularly in the annals of Adivasi education—the 1993–94 academic year stands out as a historic watershed. Exactly fifty years prior, in 1943, the Nizam’s government had first introduced the pioneering Gond Education Scheme. Though launched under the aegis of the princely state, the scheme bore the unmistakable stamp of Gandhian educational philosophy.
Mahatma Gandhi had passionately advocated that education must remain deeply rooted in community life, weave productive manual labor into learning, and transcend bookish literacy to impart a holistic philosophy of living. A close look at the core tenets of the 1943 Gond Education Scheme reveals these very ideals: a) the expansion of literacy through rural schools, adult education centers, and specialized teacher training institutes, supported by the free distribution of contextualized teaching-learning materials, b) The systematic collection, documentation, and publication of local Adivasi folklore, myths, and oral traditions—transforming unwritten tribal dialects into formal written languages and honoring them as legitimate educational literature.
As part of that historic vision, teacher training centers were established first at Marlavai and later at Ginnedhari, equipping young Gond men and women to open and manage schools across the agency. By the time I arrived in Utnoor, a few of those early pioneering teachers—now advanced in years—were still alive.
Among them was Shambhubai, the last surviving female teacher of that cohort, who served as a matron at the Utnoor Girls’ Hostel well into my tenure. The Marathi-medium instruction she had received decades earlier at Marlavai had largely faded from daily use over time, leaving her functionally illiterate in the modern administrative setup. Yet in her steadfast values, quiet self-assurance, and personal discipline, she remained an inspiring role model to everyone around her until the day she retired.
Another extraordinary proof that the Nizam-era Gond education reforms did not merely impart basic literacy, but truly refined raw clay into brilliant gems, was Master Maru of Ginnedhari. Though our meetings were few, every interaction with him revealed a man of immense dignity and unshakeable self-reliance.
Thus, rather than viewing our work—introducing activity-based learning in single-teacher schools and updating the curriculum in ashram schools—as a novel invention, it is far more fitting to see it as the historic revival of a fifty-year-old legacy whose time had come once again. The concepts we championed were by no means foreign to that soil; Adilabad possessed at least two decades of prior experience in implementing Gandhian basic education.
If we ask whether Gandhian ideals were novel to the region, we must also remember that the neighboring Marathi-speaking regions—once part of the Nizam’s dominion—had witnessed decades of vibrant social movements and intellectual currents dedicated to Dalit and marginalized education.
A living embodiment of an education built upon such organic, public foundations is Kalashram, founded and run by Ravindrakumar Sharma in Adilabad. Known affectionately to all as Guruji, Sharmaji is an extraordinary figure in modern India—a living bridge to the ancient Indian Gurukula tradition that seamlessly blended manual craft with spiritual awakening. His institution delivers what can truly be termed human-making education.
What it is like can be described in the words of Dr. S. Radhakrishnan:
“Education, according to the Indian tradition, is not merely a means to earning a living; nor is it only a nursery of thought or a school for citizenship. It is initiation into the life of spirit, a training of human souls in the pursuit of truth and the practice of virtue. It is a second birth, dvitiyam janma.”
“The purpose of education is not merely the acquiring of skill or information, but the initiation into a higher life, the initiation into a world which transcends the world of space and time, though the latter informs and sustains the former.”
Viveka (Wisdom) is not the mere accumulation of textual information; it is the practical, lived realization of truth. In the Chandogya Upanishad, when the sage Narada approaches Sanatkumara, he confesses that despite mastering every branch of worldly knowledge, he remains unfulfilled:
“Sir, I have mastered the scriptures and sciences, yet I remain merely a knower of texts (Mantravid), not a knower of the Self (Atmavid). I am consumed by sorrow; pray, lead me across the ocean of grief.”
If we understand a Mantravid as one who possesses technical skill and vast bookish learning, and an Atmavid as one who has attained deep self-awareness and inner self-reliance, then Ravindrakumar Sharma’s life work is dedicated precisely to nurturing such Atmavids.
A graduate in fine arts and sculpture from the Maharaja Sayajirao University of Baroda, Guruji possessed a masterly command of traditional sculpture. Yet rather than pursuing a conventional career elsewhere, he chose to settle in Adilabad, living alongside traditional artisans—potters, masons, bamboo crafters, lime burners, weavers, and blacksmiths. As part of his mission, he regularly visited our Kolam Ashram School, teaching young Kolam children the art of drawing and visual expression—a quiet service he continues to this day.
He spends the rest of his days at Kalashram, educating visitors on the vital role of traditional crafts, the destruction of rural self-reliance (Gram Swaraj) brought about by the East India Company and colonial industrialization, and the rising tide of unbridled consumerism (Vastu Vyamooham).
While I never had the opportunity to witness the original Basic Education (Nai Talim) schools envisioned by Mahatma Gandhi during his lifetime, I have no doubt that Guruji’s Kalashram stands as a pure, uncompromising realization of that Gandhian ideal.
Despite this rich history and the compelling precedents right before our eyes, not a single faction hesitated to oppose the comprehensive educational blueprint I introduced. Even educated Adivasi youth joined the chorus of criticism, labeling our initiatives hasty interventions and accusing us of turning tribal schools into experimental laboratories.
Had any school truly transformed into an educational laboratory, I would have considered it a badge of honor. Throughout those tumultuous days, I drew inspiration from Gijubhai Badheka’s classic work, Divasvapna. When Gijubhai set out to turn his classroom into an experimental laboratory, we must not forget that it succeeded only because his Inspector of Schools placed immense trust in him and granted him the autonomy to innovate.
The Kothari Commission had likewise emphasized that every school should enjoy the freedom to adapt a curriculum suited to its local realities. Expecting such reasoned logic and objectivity from factions consumed by opposition and fear, however, proved overly optimistic. These groups never trusted our intentions or our underlying resolve; believing that our reforms were born of an anti-teacher bias, they waited vigilantly for proof to validate their suspicion.
Eventually, that flashpoint arrived.
One evening, I was traveling from Utnoor through Keslapur toward Ichoda. Nestled along that forest route in a village named Raiguda stood one of our tribal ashram high schools. By the time I reached Raiguda, night had fallen. As I was slated to halt at Nirmal that evening, I had not originally planned to stop or inspect the campus.
Yet the sight that met me in the dark forced me to pull over. The entire campus was plunged into total darkness—there was no electricity. Neither the headmaster nor any senior faculty members were present. Upon inquiry, I learned that the teachers routinely commuted from Adilabad—fifty kilometers away—arriving late in the morning and slipping away by early afternoon.
What made this revelation particularly disheartening was that we had posted this very headmaster to Raiguda at his own personal request. Finding that even he refused to reside on campus left me deeply dismayed. Local villagers informed me that the school had been without power for over a week, yet the headmaster had taken no initiative to resolve the issue. Such flagrant negligence was deeply painful.
Here we were, articulating vision and systemic reform, while a high school headmaster abandoned his most fundamental duties. I felt strongly that leaving such irresponsibility unaddressed would be a grave injustice to the many dedicated teachers who served with integrity under challenging conditions.
The following morning in Utnoor, I reviewed the matter with our Project Officer, and we decided to relieve the headmaster of his post immediately. However, the timing was volatile. A group of previously terminated tribal instructors was already staging a hunger strike outside the ITDA office. In that charged atmosphere, the suspension of a high school headmaster was seized upon by the teachers’ unions as definitive proof of our alleged hostility. Resentment flared across the cadre.
Union representatives submitted formal petitions demanding the immediate reinstatement of the headmaster, and rounds of negotiation ensued. The Project Officer remained firm, stating he would consider any concession except unconditional reinstatement at the same station. As a final resort, a joint coalition of teacher and employee associations called for a district-wide strike, issuing a “Chalo Utnoor” rally call to staff across all corners of Adilabad.
On the eve of the demonstration, union leaders met once more with the Project Officer in an effort to avert the shutdown. By evening, a compromise was reached: the administration agreed to revoke the suspension, but the Project Officer refused to post the headmaster back to Raiguda, transferring him instead to Gadiguda—a remote village in Narnoor mandal. Neither side would yield further on this posting.
Late that night, the union leadership broke off talks, resolving to proceed with the protest the following day. The Project Officer posted a summary of the administrative decision on the notice board and left for Hyderabad that night.
Staff at the office warned that the morning demonstration would be intense, advising Professor Sashidhar Rao and me to leave town on an official inspection tour. Professor Rao heeded the advice and left on camp. Reluctant to run away, I declined to leave Utnoor; however, at the earnest request of my colleagues, I agreed to stay away from the office and remain at home.
By eleven o’clock the next morning, my wife and I stepped out to visit the Anjaneya Swamy temple located at the end of our street. We had barely turned the corner when a massive procession appeared in the distance. Comprising hundreds of shouting teachers and government employees, the march unexpectedly veered into our quiet residential lane. As the crowd advanced, I realized they were heading directly toward us.
Though processions were rarely permitted along that residential street, it became clear that the crowd had diverted toward us the moment they spotted me standing there. In that breathless moment, with nowhere to seek cover along the open road, my wife and I simply stood our ground by the roadside as the demonstration surged forward.
At last, the procession surged up to where we stood and came to a halt. Hundreds of teachers thronged the street. Their faces bore expressions of intense fury, hardened contempt, defiance, and outrage. Standing there in a ring around us, they hurled abuses in my direction. They turned toward me and spat. They jeered, shouted, yelled, and beat their chests in despair.
As I stood watching them in silent composure, a police contingent arrived on the scene at a run. Shouting warnings and dispersing the crowd, the officers forced the demonstration to move along.
That evening, a massive public meeting was organized in Utnoor. State-level leaders from various teacher and employee associations addressed the gathering, delivering fiery speeches and calling upon the cadre to publicly burn our new educational modules.
I spent that entire night awake in painful reflection. The faces of those teachers—contorted with anger and hostility as they denounced me—kept flashing before my eyes. What troubled me most was that the crowd was not made up merely of chronic absentees or derelict staff. Standing shoulder-to-shoulder among them were dedicated, conscientious teachers who loved their craft.
Most painfully, holding the union banner right at the very front of that procession was Gangadhar.
Gangadhar stood preeminent among our cadre for his exemplary character, integrity, and devotion to duty. When I first assumed charge at Utnoor, he was teaching in Dantanpally, a remote Kolam hamlet in Tiryani mandal. Everyone who knew him was moved by his fearlessness and selfless spirit of service. Wishing to bring such an exceptional teacher closer to the central administration, I had personally selected him to serve as the Headmaster of the Utnoor Girls’ Ashram School.
Yet there stood Gangadhar, leading the vanguard of a hostile demonstration against me.
Why had things come to this? Where had I failed? Overwhelmed by agonizing self-examination, sleep eluded me that entire night. By dawn, I knew what I had to do: I had to go straight to Gangadhar and ask him myself. I spent those final hours watching the clock, waiting impatiently for daylight to break.
2-8-2026


రేపటి భాగాని కోసం ఎదురు చూస్తూ (ఈ పుస్తకాన్ని ఎప్పుడో చదివినా కూడా )
చాలా సంతోషం మేడం!
బాధ్యతాయుతంగా పనిచేసేవారికి ఇలాంటి ఇబ్బందులు ఎన్నో. తాత్కాలికంగా అవి బాధను కలిగించినా అవి ఆత్మస్ఫూర్తికి దోహదం చేస్తాయి.
అవును సార్! మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను.