
సాధారణంగా చెట్లు పీల్చుకుంటాయి
చిన్నప్పుడు వేలు తెగి నెత్తురొస్తున్నప్పుడు
మీ అమ్మట్లానే ఆ వేలు నోట్లో పెట్టుకుని
పీల్చేసిందే, అలా నీ నొప్పి పీల్చేస్తాయి.
అప్పుడు నువ్వు అంతా మర్చిపోయి అసలేమీ
జరగనట్టే మళ్ళా ఆటల్లో పడిపోయావు చూడు,
అలా చెట్లు చెరిపేస్తాయి, ఇంటికొచ్చేటప్పటికి
నీ హోం వర్కంతా ఎవరో చేసేసుంటారు.
సగం చదివి బల్లమీద అలానే వదిలిపెట్టేసిన
పుస్తకంలాగా, చెట్లలానే ఉంటాయి, మళ్ళా
తెరిచే లోపు గాలికి పేజీలు కలిసిపోతాయి
కాని ఫాల్గుణం చేవ్రాలు మిగిలిపోతుంది.
10-3-2026
నొప్పి ని పీల్చేసే చెట్లు!!
Beautiful paintings, Sir
ధన్యవాదాలు!
Wahwa
ధన్యవాదాలు!
👏👏👏
ధన్యవాదాలు సార్