
నిర్వికల్ప సంగీతం (1986) వెలువడి నలభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అందుకని అందులోంచి గతంలో అనువదించిన కొన్ని కవితలతో పాటు మరికొన్ని ఇంగ్లిషులోకి అనువదించాను. దానితో పాటు, ‘ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ (1995) సంపుటినుంచి కూడా గతంలో అనువదించిన కవితలతో పాటు మరికొన్ని కవితలు అనువదించాను. మొత్తం 45 కవితలు. వీటిని ఇలా Song of My Village: Selected Poems, 1982-1992 పేరిట ఒక ద్విభాషాసంపుటిగా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని నా రాజమండ్రి రోజుల మిత్రుడూ, కవీ, చక్రాల వెంకట సుబ్బు మహేశ్వర్ (మహేశ్) కి అంకితమిస్తున్నాను. ఆ నా మిత్రుడు స్వర్గంలోంచి ఈ కానుకను సంతోషంగా స్వీకరిస్తాడని నమ్ముతున్నాను. ఒక డిజిటలు ప్రతిని మహేశ్ శ్రీమతీ, మా మిత్రురాలూ శకుంతలగారికి కూడా పంపిస్తున్నాను.
ఇందులో కొన్ని కవితల్ని మూడేళ్ళ కిందట నా బ్లాగులో పంచుకున్నప్పుడు వాటిని ఎప్పటికప్పుడు చదివి సూచనలు చేసిన మిత్రుడు కన్నెగంటి రామారావుకి నా ధన్యవాదాలు.
ఇది నా 74 వ పుస్తకం.
19-11-2025
అద్భుతం సోదరా!
ధన్యవాదాలు సార్!
మీ కవితల లాగానే, మాటల లాగానే మీ చర్యలు కూడా మనసు ని తాకి హృదయాన్ని స్పృశించి కళ్ళని తడిపేస్తాయి. మహేష్ ని మీరు మరోసారి తలుచుకోవడం , శకుంతల గారిని పలకరించడం చదూతుంటే రాజమండ్రి గోదావరి ఒడ్డు,సమాచారం ఆఫీసు అన్నీ గుర్తుకొచ్చి గుండె గొంతుక లో గూడు కట్టినట్టయ్యింది
పులుగుర్త వెంకట కృష్ణారావు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!