పుస్తక పరిచయం-34

మూడు వారాల విరామం తర్వాత మళ్ళా మేఘసందేశం పైన ప్రసంగాలు ప్రారంభిస్తున్నాను. రెండవ సర్గలో 19 వ శ్లోకం నుండి 32 వ శ్లోకం దాకా ఈ రోజు ముచ్చటించాను. ఇందులో యక్షుడు అలకాపురిలో తన భార్య విరహావస్థలో ఏ విధంగా ఉండిఉండవచ్చునని భావిస్తున్నాడో చూడవచ్చు

3-10-2025

4 Replies to “పుస్తక పరిచయం-34”

  1. సుందరకాండ లో విరహిణిగా వున్న సీతను వర్ణించిన వాల్మీకి శ్లోకాల సారాంశాన్ని వచన రూపంలో విన్న తరువాత, అలాగే కాళిదాసు మేఘ సందేశం లో యక్షుడు తన భార్య విరహిణిగా ఎలా కనిపిస్తుందో ఊహించిన శ్లోకాలను మీరు వివరించిన తీరు అమోఘం.. ఎంతో అందంగా, అర్థమయ్యే విధంగా విశ్లేషించారు. మరొక విషయం.. ఈ రెండు వర్ణనలు విన్న తరువాత.. వేటూరి మేఘ సందేశం సినిమాకోసం వ్రాసిన పాటలో ఈ భావాలను ఎంత బాగా క్లుప్తీకరించారో తలచుకుంటేనే తన ప్రతిభా పాటవాలు, ప్రాచీన సాహిత్యాల పట్ల ఆయన పట్టు మీద మరింత గౌరవం పెరిగింది. వేటూరి పాటలో చరణాలు, పల్లవి లో శోభ మీ ఈ ప్రసంగం విన్న తరువాత మరింత అవగతమయ్యింది. మీకు అనేక ధన్యవాదాలు.

    వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై..
    ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని..
    కడిమి వోలే నిలిచానని…
    ఉరమని తరమని ఊసులతో..
    ఉలిపిరి చినుకుల బాసలతో..
    విన్నవించు నా చెలికి..
    విన్న వేదన నా విరహ వేదన..

    రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై..
    ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని..
    శిథిల జీవినైనానని..
    తొలకరి మెరుపుల లేఖలతో..
    రుధిర భాష్ప జలధారలతో..
    విన్నవించు నా చెలికి..
    మనోవేదన నా మరణయాతన..

    ఆకాశ దేశాన ఆషాఢ మాసాన..
    మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా..
    విరహమో దాహమో విడలేని మోహమో..
    వినిపించు నా చెలికి..
    మేఘసందేశం.. మేఘసందేశం..

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  2. Was waiting for this talk and thank you so much for continuing prayanam with the Megham and bringing us along, Sir!

    అలకాపురిలోని యక్షుని ఇంటి వరకూ మేఘుని తీసుకువెళ్ళి, తాను లేక శోభ తగ్గిన తన ఇంటిలో తన భార్య ఏ అవస్థలలో ఉండి వుండవచ్చో ఊహించిన శ్లోకాలు చాలా beautiful గా వున్నాయి.

    వాల్మీకి సుందరకాండలోని సీతాదేవి వర్ణన and ఆ influence on Kalidasa while he describes విరహిణి యక్షిణి is very enlightening, Sir.

    20వ శ్లోకంలో ఉరుముల మెరుపుల మేఘాన్ని తనను తాను తగ్గించుకుంటూ, చిన్న చిన్న మిణుగురులు వలె మెరుపును లోపలికి ప్రసరించడానికి వీలుగా కమ్మనడం,
    అశోకవనంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తనని తానే కుంచించుకొని వెళ్ళడం- drawing parallels between the two greatest poets of all time, and showing us how to read poetry and its purpose:
    “Kavitvam ela chadavalante—chitrinchina varnana ni matrame chudadam kadu, chitrinchina dani venaka unna manasthiti ni chudali, akkadiki cheragalagali, appude kavi manobhavalaato mana manobhavalu ekamavutayi.”

    21వ శ్లోకం: యక్షిణి ఆకృతిని వర్ణించే శ్లోకం, and how he describes her, ending with “Tholi srushti vela aa Brahma manasuloni nirmalatvam antha aame lo podivi pettadani cheppavachu” ఎంతో అందమైన, pure emotion in those lines.

    “Aame ila undi undavachu, alaa undi untundemo ani” Kalidasa creates such beautiful oohalu. Yakshini తన యక్షుణ్ని తలుచుకుంటూ, ఆయన మీద ఆమే కట్టిన పాటను మరిచిపోవడం – very touching scenes!

    మెట్ట తామర పోలిక అద్భుతంగా వుంది. కవి అప్పటి దాకా దాచుకున్న పోలికను యక్షిణి దుఃఖాన్ని వర్ణించడానికి తెచ్చుకున్నారు అని మీరు వివరించి, you showed us the beauty in poetry and how to appreciate it.

    Please post your poetry on మెట్ట తామరలు, Sir!! 🙏🏽

    Thank you so much for these superb talks in megha sandesa kavyam, sir!!

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! నేను కూడా మీ ప్రతిస్పందన కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నాను. సముద్రాలు దాటి వచ్చే మీ స్పందన నాకు సముద్రాలు దాటి వచ్చిన శుభ సందేశం లాగా వినిపిస్తుంది.

      మెట్ట తామర పూల మీద నేను రాసిన కవిత ఇంటర్మీడియటులో రాసింది. పోగొట్టుకున్న ఎన్నో కవితల్లో అది కూడా ఒకటి.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%