ఇప్పుడు నాక్కూడా అనుభవం

ఒకరాత్రివేళ ఏదో సవ్వడి వినబడి బాల్కనీలోకి వచ్చి చూస్తే
వీథిలో ఒక్కర్తీ నా చిన్నప్పటి భాషలో మాట్లాడుతున్నది వాన.

పొలాలని ఫలాలుగా మార్చే మాటలవి. కాయలు పండ్లుగా
మారేదెన్నడని తలపోస్తూ మిగిలిన రాత్రంతా గడిపేను.

ఇన్నాళ్ళూ కాయని కాయగా, పండుని పండుగా చూసాను
కాయగా బతుకుతూ ఒకనాటికి పండుగా మారాలనుకున్నాను.

హటాత్తుగా స్ఫురించింది, కాయలే నెమ్మదిగా పండ్లవుతాయని-
ఎన్నో రాత్రులపాటు మగ్గుతూ మగ్గుతూ మధురమవుతాయని.

కాయలోంచి వగరూ పులుపూ ఒక్కొక్కటీ తొలగిపొయే క్షణాలు-
అబ్బా! అది చెప్పలేని పెనగులాట. చెప్పుకోలేని నలుగులాట.

కాయ పండుతున్నప్పుడు అదొక వరదలాగా ముంచెత్తుతుందా?
లేక తెల్లవారే వెలుగులాగా, పూలలో రంగులాగా వ్యాపిస్తుందా?

ఒక్కటి మాత్రం చెప్పగలను. చేదు విరిగినప్పుడే జీవితం సఫలం.
యుగాలుగా చెట్లకి తెలిసిన సంగతి ఇప్పుడు నాక్కూడా అనుభవం.

11-8-2025

24 Replies to “ఇప్పుడు నాక్కూడా అనుభవం”

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మానసా!

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మేడమ్!

  1. చేదు విరిగినప్పుడే జీవితం సఫలం..ఎంత సత్యం. కానీ ఇది గ్రహించటం ఎంత కష్టం. మంచి మాట చెప్పేరు. ధన్యవాదాలు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సోదరీ!

  2. కాయ పక్వానికి వస్తేనే ఇలాంటి కవితలు పండుతాయి . నడిరాత్రివానలో ఆలోచనల జడి
    ఆలోకనల తడి, అక్షరాల గుడి.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సోదరీ!

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  3. పొద్దునే ఎంత మంచి కవిత..ఒక కవితా దీపం మరొక కవితా దీపాన్ని వెలిగించగలదు..మీరొక ఆరని జ్వాల

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  4. “ఎన్నో రాత్రుల పాటు మగ్గుతూ మగ్గుతూ మధురమౌతాయని” … ” చేదు విరిగినప్పుడే జీవితం సఫలం” … అద్భుతం.

  5. విత్తు బట్టే చెట్టు, పూత, పిందె , కాయ, పండు. చాలా తక్కువమంది జీవితం తెల్లవారే వెలుగులాగా, పూలలో రంగులాగా వ్యాపిస్తూ తన చుట్టూ పక్కలనున్న చెట్ల కాయలకి కూడా ప్రసరింపచేసి తాను పండుతుంది. ఆ తక్కువమందిలో మీరు ఉండి తీరతారు..

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్!

  6. Beautiful sir!! 🙏🏽

    The imagery you used, symbolizing life and showing its beauty and truth, took me on a journey through my own life to see the growth and transformation within me.

    “కాయలే నెమ్మదిగా పండ్లవుతాయని-
    ఎన్నో రాత్రులపాటు మగ్గుతూ మగ్గుతూ మధురమవుతాయని.“

    Your painting, every image you created with your words and the essence of philosophy they carried is simply amazing, sir! 🙏🏽

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! మీరు చదవగానే ఆ మాటల్లో కొత్త వెలుగు చేరుతుంది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%