మనసున మనసై

పదేళ్ళ కిందట, ఒక మిత్రుడు వాళ్ళబ్బాయి పెళ్ళి సందర్భంగా, అతిథులకి ఇవ్వడానికి ఏదేనా పుస్తకం ఒకటి డిజైను చేసిమ్మని అడిగాడు. తనదగ్గర బాపు బొమ్మలు కొన్ని ఉన్నాయని కూడా చెప్పాడు. అప్పుడు ‘మనసున మనసై: భారతీయ కవులూ, వారి హృదయేశ్వరులూ’ అనే పుస్తకం రూపొందించాను. నా మిత్రుడు తనదగ్గరున్న బాపు బొమ్మల్ని ఆ కవితలకు తగ్గట్టుగా ఉపయోగించుకున్నాడు.

అయితే అది పెళ్ళికానుక కాబట్టి విస్తృతపాఠకలోకానికి అందుబాటులో లేకుండా ఉండిపోయింది. అదీ కాక, ఆ పుస్తకం ఎ-4 సైజులో ఉండటంతో అది పాఠకసన్నిహితం కాదు. అందుకని ఆ పుస్తకాన్ని ఇప్పుడిలాగ ఎ-5 సైజులో రీడిజైను చేసి మీతో పంచుకుంటున్నాను. మహత్తరమైన భారతీయ మీనియేచర్లనుండీ, భారతీయ శిల్పాల నుండీ, అజంతా చిత్రలేఖనాలనుండీ, అవనీంద్రుడు, రవీంద్రుడూ, అమృత షెర్-గిల్, అబ్దుర్ రహమాన్ చుగ్తాయి వంటివారి చిత్రలేఖనాల నుండీ ఎంపిక చేసిన బొమ్మల్ని ఆయా కవితలకు తగ్గట్టుగా పొందుపరిచాను.

ఇస్మాయిలు గారు ఉండి ఉంటే ఈ పుస్తకానికి ఆయనతో ఒక ముందుమాట రాయించుకుని ఉండేవాణ్ణి. ఇప్పుడు ఆ లోటు ఎవరు పూరించగలరా అని ఆలోచిస్తే మానస చామర్తి కనిపించారు. ఆమె ‘ప్రేమ మంత్ర మహోపాసన’ అని రాసిన సమీక్ష ఈ పుస్తకానికి తలమానికం.

ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులకు కానుకగా పంపుకోవచ్చు.

9-7-2025

8 Replies to “మనసున మనసై”

  1. ధన్యవాదాలండీ. గత పదేళ్లగా.. మీ నుంచి ప్రతి రోజు ఒక కొత్తవిషయం నేర్చుకుంటూనే ఉన్నాను. మీకెలా కృతజ్ఞతలు తెలపాలా అని అనుకుంటా. గురుపూర్ణిమ సందర్భంగా మీకు హృదయపూర్వక నమస్సులు🙏🙏

    1. హృదయపూర్వక నమస్కారములు. మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు. శుభాకాంక్షలు.

  2. Rajendra Prasad Maheswaram – Hyderabad – Nothing great. Just a simple person who loves my village and my roots from my village. Loves to be there and share all the joys with my people living there.. Loves to keep all my memories of staying close to my father in my village and ancestral house.. My village is my paradise...
    Rajendra Prasad M Maheswaram says:

    గురుపౌర్ణమి సందర్భంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🌹

    1. హృదయపూర్వక ధన్యవాదాలు. శుభాకాంక్షలు

  3. మనసున మనసై పుస్తకానికీ స్వాగతం. ఒక అద్భుత పుస్తకాన్ని అందించారు. ధన్యవాదాలు సర్

    1. హృదయపూర్వక ధన్యవాదాలు సార్

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%