కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.
