సంతోషం ఒక క్రియాపదం

నిజమైన సంతోషం నామవాచకం కాదు, ఒక క్రియాపదం అన్నాడు ప్రసిద్ధ స్టోయిక్కు తత్త్వవేత్త ఎపిక్టెటసు. అంటే  సంతోషంగా ఉండటమనేది నిత్యం మన ప్రయత్నం మీద, మన క్రియాశీలత్వం మీద, అహర్నిశలు మన జాగరూకత మీద ఆధారపడి ఉంటుందని ఆయన ఉద్దేశ్యం. చాలాసార్లు మన మనసుమీద ప్రపంచపు దుమ్ముపడుతూ ఉంటుంది. నిరంతరం జ్వలిస్తూ ఉండవలసిన మన జీవితేచ్ఛమీద నివురు పేరుకుంటూ ఉంటుంది. అటువంటి సమయాల్లో గొప్ప కవిత్వాలు మనల్ని మనకి సన్నిహితుల్ని చేస్తాయి. అలానే గొప్ప యోగుల, ఋషుల, దార్శనికుల, చింతకుల, బోధకుల, సాధకుల రచనలు కూడా మనల్ని ఎప్పటికప్పుడు పడిపోకుండా నిలబెడుతూ ఉంటాయి. అటువంటి మహాత్ముల రచనలు చదివినప్పుడు రాసుకుంటూ వచ్చిన నలభై వ్యాసాల సంపుటి ఇది. నిజానికి గతపదేళ్ళ కాలంలో మరెన్నో ఇటువంటి వ్యాసాలు రాసుకోవలసి ఉండింది. కాని ఆ స్థానంలో కవిత్వమూ, విద్యా, చిత్రలేఖనమూ నా మనసుని ఎక్కువగా పట్టి ఉన్నాయి. కాని ఇప్పుడు నా మనసు మరింత తేటపడుతూ ఉంది. రానున్న రోజులంతా ఇటువంటి మహనీయుల శుశ్రూషలోనే గడపాలనుకుంటున్నాను.

గడిచిన జీవితంలో నేను క్లిష్టసమయాల్లో నడిచినప్పుడల్లా నాకు తోడుగా నిలబడ్డ పరమయోగి శ్రీ వై.హనుమంతరావుగారి దివ్యస్మృతికి ఈ పుస్తకాన్ని కానుక చేస్తున్నాను.

దీన్నిక్కడ మీరు డౌనులోడు చేసుకోవచ్చు. ఇటువంటి ఆసక్తి ఉన్న మిత్రుల్తో పంచుకోవచ్చు.


ఇది నా 65 వ పుస్తకం.

24-6-2025

6 Replies to “సంతోషం ఒక క్రియాపదం”

  1. వందనములు. మీ వాస్యాలు చదవటం ఒక గొప్ప విద్యను నేర్చుకోవటమే. కృతజ్ఞతలు

  2. Sir, ఊటబావి మీరు 😊
    Your observation about how reading poetry or the works and spiritual reflections of great souls can show us the way and strengthen us during restless times rings so true for me.

    I’m very much interested in this topic and will definitely read the book. But may be very slowly. 😊🙏🏽

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%