పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా టాగోర్ కవిత్వం మీద ఇది నాలుగవ ప్రసంగం. టాగోర్ కవిత్వ ప్రయాణంలో 1900-1910 మధ్యకాలంలో రాసిన కవిత్వం గురించీ, ముఖ్యంగా 'నైవేద్య', 'ఖేయా' సంపుటాల గురించీ, 'నష్టనీడ్' నవలిక గురించీ ఈ రోజు ప్రసంగించాను . ఈ ప్రసంగాన్ని కూడా మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
అంటున్నాడు తుకా-10
జీవితంలో నెగ్గాలనుకుంటే సాధనాలు రెండున్నాయి. మరొకరి సొమ్ముని ఏవగించుకోవటం మరొకరి భార్యను తలవకపోవటం.
ఏప్రెల్లో ఒక రోజు
వానాకాలంలో పొంగిపొర్లే ఏటిలాగా ఉరకలెత్తుతున్న వసంతం. నా కళ్ళముందే కొట్టుకుపోతున్నవి కాలం, గగనం, నగరం.
