అతడి జీవితంలో నిజంగా దుర్భరమైన అధ్యాయం అంటే ఇదే. అతడు తన తొలి కవిత్వం 1829 లో అచ్చువేసుకుంటే, ఆ తర్వాత ముప్ఫై ఏళ్ళకు పైగా అతడిరకా బానిసగానే జీవించవలసి రావడం. తాను బానిసగా జీవిస్తున్నాడు అనే చైతన్యం లేకపోయి ఉంటే, ఆ నరకం వేరు. కాని తాను బానిసగా జీవించవలసి వస్తూండటాన్ని తన మనసూ, బుద్ధీ కూడా అంగీకరించడం లేదని తెలిసాక కూడా ఆ జీవితమే జీవించవలసి రావడంలోని నరకం మన ఊహకి కూడా అందేది కాదు.
ఫిలిస్ వీట్లి
ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నేను వెలువరించిన 'వికసించిన విద్యుత్తేజం' పుస్తకానికి ఇప్పటిదాకా ఒక్క సోమశేఖర్ నుంచి మాత్రమే ప్రతిస్పందన లభించింది. ఆ పుస్తకంలో మూడు నాలుగు కొత్త వ్యాసాలున్నాయి. కాబట్టి మిత్రులు వాటిని ఇక్కడైనా చదువుతారని ఇలా అందిస్తున్నాను.
ఇప్పుడు మిగిలిన స్నేహాలు
నాకొచ్చిన ఓ ఉత్తరాన్ని నలుగురూ వినేలా వీథిలోనే చదివి వినిపిస్తుంది వసంతకాలపు వాన.
