కాని ఈ పుస్తకం వేరు. ఇందులో విరాగి కాదు, రాగమయి కనిపిస్తుంది. ఒక ప్రేమసముద్రాన్ని గుండెలో మోసుకుంటూ తిరుగుతున్న ప్రేమికురాలు కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది, ఒక చెల్లి, ఒక అక్క, ఒక క్లాస్ మేట్, ఒక సహచరి, ఒక క్షమామూర్తి, చివరికి, 'నగ్నపాదాలు 'అనే రచనలో ఆమె కోపం కూడా కనిపిస్తుంది.
పునర్యానం-35
కాబట్టి, వనరుల్ని నియంత్రించే అధికారం కలిగినదానిగా రాజ్యం మరింతగా బలపడుతూనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే, కలోనియలిజం రోజుల్లో, వలస రాజ్యాల ప్రభుత్వాలు ఇక్కడ పనిచేసేవి. ఇప్పుడు వలసరాజ్యాలకోసం మనమే ప్రభుత్వాలు నడుపుతున్నాం, ఆ ఖర్చు కూడా వాళ్లకి లేకుండా.
పునర్యానం-34
ఈ అపరిశుభ్రతకి గల కారణాల్ని విశ్లేషించడం మొదలుపెడితే, ఒక సాంఘిక-రాజకీయ వ్యవస్థగా మనం ఎంత దిగజారుతూ ఉన్నామో, నానాటికీ ఎంత అసమర్థంగా తయారవుతున్నామో అదంతా వివరించవలసి ఉంటుంది.
