పునర్యానం-58

ఎన్నో ఏళ్ళుగా తపసు చేస్తున్నవాళ్ళకీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడే ప్రవేశం. ఇవేళ హటాత్తుగా నిద్రలేచి, దేవుడెక్కడున్నాడో చూద్దామని అడుగేస్తే, వాళ్లకీ అక్కడే ప్రవేశం. చదువుకున్నవాళ్లకీ, చదువుకోనివాళ్ళకీ, దారివెతుక్కునేవాళ్ళకే కాదు, చివరకు నువ్వు దారితప్పావా, అయితే, అక్కడకూడా ఆ తలుపు నీకోసం తెరిచే ఉంటుంది.

పునర్యానం-57

నీ జీవితంలో నీకు తారసపడే మిత్రులు, గురువులు, అనుభవాలు- ప్రతి ఒక్కటీ కూడా నువ్వెంత పరిణతి చెంది ఉంటే ఆ మేరకే నిన్ను ఉత్తేజపరచగలుగుతాయి. లేదా మరోలా చెప్పాలంటే నువ్వు పరిణతి చెందనంతకాలం నీ పరిచయాలూ, స్నేహాలూ, అనుభవాలూ కూడా అపరిణతంగానే ఉంటాయి.

పునర్యానం-56

ఈ కవితకు వచ్చేటప్పటికి నేను నా సంకోచాలనుంచి పూర్తిగా బయటపడ్డాను. చిన్నప్పుడే మహాభక్తవిజయం చదివి, పోతన్నని కంఠస్థం చేసినా కూడా, విశ్వాసం కుదురుకోవాలంటే ఇంత జీవితం సాగి ఉండాలా అనిపిస్తుంది. నేను విశ్వాసిని అని చెప్పుకోడానికి ఇప్పుడు నాకేమీ సందేహం లేదు. కాని ఆ విశ్వాసం దృఢపడేముందు ఎంత నరకం చూసానని!

Exit mobile version
%%footer%%