ఉగాది శుభాకాంక్షలు

మిత్రులందరికీ శోభకృత్ నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది కొత్త సంతోషాల్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరింత సాహిత్యం, మరింత సంగీతం, మరిన్ని మేలుతలపుల్తో ఈ ఏడాది పొడుగునా మీతో కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నాను.

ప్రపంచ కవితా దినోత్సవం

నినాదాలు, ప్రచారాలు, అనుకరణలు, పొగడ్తలు, తెగడ్తలు కవిత్వంగా చెలామణి అవడం మొదలుపెట్టాయంటే ఆ జాతి ధ్వంసం అవుతున్నట్టు. నిరలంకారంగా, సూటిగా పలికే ఒక చక్కనిమాటకి శ్రోతల హృదయాలు స్పందిస్తున్నాయంటే ఆ జాతికి మంచిరోజులు వచ్చినట్టు.

వరమాలికా ప్రసాదుడు

మునిపల్లె రాజు ఒక శతాబ్ది సమానుడు. తెలుగునేలను ప్రభావితం చేసిన సాహిత్య, సాంఘిక, సాంస్కృతిక ప్రభావాలన్నింటికీ ఆయన వారసుడు. ఆయన రచనలు చదువుతూ ఉంటే మనం ఒక మనిషినో, ఒక కుటుంబాన్నో కాదు, వందేళ్ళ సామాజిక పరివర్తనని దగ్గరనుంచి చూస్తున్నట్టుగా ఉంటుంది.

Exit mobile version
%%footer%%