ఒక అశ్వం ఎదురుపడిన క్షణం

Horses, painting by M F Hussain, Image courtesy: asianage.com

నాసరరెడ్డి నాకు పంపించిన రెండు కవితల్లో రెండోది. 3-11-2000 న అచ్చయిన కవిత. అసలు ఈ కవిత రాసినట్టే గుర్తు లేదు నాకు. క్షణంపాటు నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తిందీ కవిత.

**

ఒక అశ్వం ఎదురుపడిన క్షణం

నగరంలో
నడి ట్రాఫిక్ సమ్మర్దంలో
అన్ని వాహనాల మధ్య ఒక ఆశ్వికుడు
ఆ అశ్వం.

ఆ గుర్రం నాకు గుర్రాన్ని గుర్తుకు తెచ్చింది.
ఆ స్ఫురణలో
దౌడు తీస్తున్న అశ్వాల గుంపులు
పచ్చిక మైదానాలు
రక్తం పారే రణభూములు.

ఇంతలో మళ్ళీ
ట్రాఫిక్ లైట్లు,
కానిస్టేబుల్ విన్యాసాలు-
అన్ని వాహనాలతో పాటు
అశ్వం కూడా ముందుకు కదిలింది.

అయితేనేం, ఆ అశ్వం
ఒక క్షణం నన్ను ఆశ్వికుణ్ణి చేసింది.
ఇంతలో అదీ నేనూ విడిపోయేం.
వెళ్ళిపోతూ ఆ అశ్వం
నా గుర్రపుశాల
తలుపులు తెరిచి మరీ పోయింది.

Featured photo: A painting in mixed media, after the prehistoric painting (15000 BC) of a Chinese horse, Lascaux caves, France,

4-12-2022

2 Replies to “ఒక అశ్వం ఎదురుపడిన క్షణం”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading