పద్యం నిర్మించడం కన్నా పాట కట్టడం చాలా కష్టం. అందుకనే ప్రజలు గుర్తుపెట్టుకునేది పాటలు కట్టేవాళ్ళని మాత్రమే. అందులోనూ, తనదైన సొంతగొంతుతో పాటకట్టేవాళ్ళు ఏ భాషలోనైనా కొంతమందే ఉంటారు. బసవరాజు అటువంటి కవి.తెలుగులో ప్రసిద్ధి చెందిన ఎన్నో గీతాలకూ, కవితలకూ మూలవాక్కు ఆయన కవితల్లో కనిపిస్తుంది.