
7
కె. ఎం. సుగుణగారు
కె.ఎం.సుగుణగారు పాఠశాల విద్యార్థి బహుముఖప్రజ్ఞని వెలికితీసే సాధనంగా తీర్చిదిద్దాలని తపించిన వ్యక్తి. ఆమెలో క్లాసికల్ గ్రీకు జ్ఞానతృష్ణా, రినైజాన్స్ మానవుడి అభిరుచీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమూ సమానంగా మేళవింపుకు వచ్చాయి. ఒక పరిపాలనాదక్షురాలిగా ఆమె చూపిన నేర్పు యూనివెర్సిటీ వైస్ ఛాన్సలర్లలో కూడా కనలేమంటే అతిశయోక్తి కానేరదేమో.
ఆమె వ్యక్తిగత జీవితం, ఆ జీవిత విశేషాలు నాకే మాత్రం తెలియవు. కాని ఆమే లేకపోయింటే, ఆమె సన్నిధిలో నా నాలుగేళ్ల విద్యాభ్యాసం కొనసాగనట్లయితే నేను ఎలా ఉండేవాన్ణో ఊహించకుకోవడం కష్టం. మా అమ్మ కేవలం అయిదవ తరగతి దాకానే చదువుకుంది. అలాకాక మా అమ్మ బి.ఏ.ఎల్.టి.చదివి ఉండి, ఆమె ఎన్నో ఏళ్లు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేసి ఉండిన విద్యావేత్త అయి, ఆమె ప్రిన్సిపాలుగా పనిచేస్తుండిన పాఠశాలలోనే నా హైస్కూలు చదువు సాగి ఉంటే? అప్పుడది నా తాడికొండ చదువు అయి ఉండేది.
సుగుణగారిని తల్లివలే భావించిన విద్యార్ధులు ఎందరో ఉండవచ్చు గాక. కాని ఆమె తనకి అత్యంత ఇష్టమైన పిల్లలుగా భావించినవారంటూ ఎవరన్నా ఉంటే వారిలో మొదటివాడుగా నేనుంటానన్నది మాత్రం నా అచంచలమైన నమ్మకం.
ఎందుకంత ప్రేమించింది ఆమె నన్ను? నేననుకుంటాను, పిల్లవాడిని బహు ముఖంగా తీర్చిదిద్దడానికి పాఠశాల ఉత్తమసాధనం అనే తన నమ్మకాన్ని పరీక్షకు పెట్టడానికి తగిన లోహమేదో ఆమెకి నాలో కనబడింది. ఒక్కొక్కప్పుడు అది నన్ను ఊపిరివిడవనివ్వడంత సఫొకేటింగ్‌గా ఉండేది.
తక్కిన విద్యార్ధులూ, ఉపాధ్యాయులూ కూడా ఎవరి డిసిప్లినీరింగ్‌ని చూసి వణికేవారో అటువంటి ప్రధానోపాధ్యాయుని నన్ను తన ఎంపిక చేసుకున్న పిల్లవాడిగా పెంచి పెద్దచేసినందుకు నేను చాలా పెద్ద మూల్యమే చెల్లించాను. దాదాపు ముప్పై మంది విద్యార్ధులుండే మా సెక్షన్‌లో ఎప్పుడన్నా సరే నాతో ఇద్దరు ముగ్గురికి మించి ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. వారి అకారణ మాత్సర్యాన్నీ, క్రోధాన్నీ నేను అనునిత్యం చవిచూడవలసి వచ్చేది.
ఒకవైపు నానాటికీ ఇంటిమీద పెరుగుతున్న బెంగ, మరొకవైపు సహవిద్యార్ధుల ద్వేషం నాకా పాఠశాలని చాలా ఇరుకైన బందిఖానాగా మార్చేసాయి. కాని సుగుణగారు నాకోసం ప్రతి దినం అన్వేషిస్తూ ఉండే నూతనావకాశాలు, నాకు అప్పగిస్తుండే కొత్త అసైన్‌మెంట్లు నాకా బాధని సహించడం నేర్పడమే కాక జీవితాన్నొక సవాలుగా తీర్చుకోవడమెలానో నేర్పాయి.
పాఠశాలలో సి.ఎస్.రావుగారు ప్రారంభించిన డిసిప్లిన్‌నే సుగుణగారు కూడా కొనసాగించారు. కాని ఆ రెండింటిలో తేడా ఉంది. సి.ఎస్.రావుగారిది మిలటరీ కేంపుల్లో ఉండే క్రమశిక్షణ. సుగుణగారిది స్వచ్ఛంద సేవాశిబిరాల్లో ఉండే క్రమశిక్షణ. ఆమె మాకు క్రమశిక్షణను ప్రేమించడం నేర్పారు. సహజంగా ప్రకృతి ఒడిలాంటి అడవుల నుంచి పాఠశాలకి అడుగుపెట్టిన నాకు ఆ క్రమశిక్షణ మొదట్లో ఊపిరాడనివ్వదిగా ఉండేది.
రాను రాను గ్రహించాను. అది ఋతుసంరంభానికి అడవి తలొగ్గడంలోని క్రమశిక్షణ అని. ఆమె ఎన్నోసార్లు పదే పదే చెప్పినా విసుగెత్తని మాట : ‘చదువు ముఖ్యం కాదు, చదువెలాగయినా వస్తుంది. క్రమశిక్షణ ముఖ్యం’.
‘పేట్రియాటిజం అంటే ఏమిటి?’ ఆమె ఎన్నోసార్లు ఈ ప్రశ్న వేసి క్షణం పాటు ఆగేది. తరువాత ఆమె తనకు తానుగా చెప్పే ఆ సమాధానాన్ని అప్పటికెన్నో సార్లు విన్నా విన్న ప్రతిసారీ ఆ సమాధానం కొత్తగా ఉండేది.
ఆమె అనేది కదా : ‘దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణత్యాగం చెయ్యడమే కానక్కర్లేదు. నువ్వు ఆ దారమ్మట పోతున్నావనుకో. స్కూలు ప్రెమిసెస్‌లో ఎక్కడన్నా చెత్త కాగితాలు కనబడిందనుకో. దాన్ని తీసి చెత్తబుట్టలో వెయ్యడం కన్నా మించిన దేశభక్తి ఉంటుందనుకోవద్దు’ అనేది.
ఇంకా అనేవారామె : ‘మీరు డైనింగ్ హాలు దగ్గర చేతులు కడుక్కుంటున్నప్పుడు ఏదన్నా కుళాయిలో నీళ్లు వృథాగా పోతున్నాయనుకోండి. ఆ కుళాయిని కట్టకుండా మీరక్కణ్ణించి వెళ్లిపోలేకపోతున్నారంటే మీకు దేశాన్ని ప్రేమించడం అలవాటయినట్టే. ఇక రాత్రి మీరు సెల్ఫ్‌స్టడీ నుంచి డార్మిటరీకి వెళ్తున్నప్పుడు మీలో తరగతిగది నుంచి అందరికన్నా వెనగ్గా ఎవరు వస్తున్నారో అతడు లైటు, ఫాను స్విచ్చి ఆఫ్ చేసి బయటకు రాగలిగితే అదే దేశభక్తి’.
ఎదుగుతున్న వయసులో ఉన్నాం కాబట్టి, దాదాపు అయిదారువందల మంది విద్యార్ధులూ, ముప్పైమందికి పైగా ఉపాధ్యాయులూ ఉండే పాఠశాల కాబట్టి ఆమె డిసిప్లిన్ మీద అతిశ్రద్ధ చూపిస్తున్నారని మాలో మేం ఎవరికీ వినబడకుండా సణుక్కునేవాళ్లం. ఆమె డిసిప్లిన్ గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్లం. క్రమశిక్షణ గురించి ఆమె ఎక్కువ మాట్లాడేవారు కనుక ఆమె క్రమశిక్షణ మీదనే ఎక్కువ దృష్టి పెట్టేవారని మేం అనుకోవడం సహజం. కాని అది నిజం కాదు.
ఆమెలో గొప్ప కళాత్మక హృదయం ఉండేది. రొటీన్‌గా ఉండే పాఠశాల దైనందిన చర్యను సంతోషసంరంభంగా మార్చడానికి ఆమె చేసిన ప్రయత్నాలూ, ప్రయోగాలూ అన్నీ ఇన్నీ కాదు. ఆ విషయంలో ఆమెవంటి ప్రధానోపాధ్యాయుణ్ణి నేనింతదాకా చూడలేదు. దాన్నే యాంత్రిక నైపుణ్యాల స్ధానంలో సృజనాత్మక నైపుణ్యాల్ని తీసుకురావడం అంటున్నాను. దాన్ని తీసుకురావడానికి ఆమె ఎన్ని విధాలుగా ప్రయత్నించిందో చెప్పలేను.
మొదటిది, మా పాఠశాలలో ముందుండే ఖాళీ స్ధలాన్ని ఆమె పార్కుగా మార్చింది. ఆ పార్కుకొక అందమైన నమూనాని డిజైన్‌ని చేసింది. అందులో గులాబులు, మెట్టతామరలు, నందివర్ధనాలు విరబూసి ఉండేవి. ఆ పార్కునిండా పచ్చని పచ్చిక వికసించి ఉండేది. ఆ పచ్చికలో అక్కడక్కడ సిమెంటు బెంచీలుండేవి. సాయంకాలల్లో పిల్లలు కొద్ది సేపు ఆ పార్కులో కూచుని ఉండేవారు
పడమటి దిక్కునుంచి సాయంసంధ్యారశ్మి ఆ పచ్చిక మీద ప్రసరిస్తూ ఉండగా మా సాయంకాల సమావేశానికి ఏర్పాట్లు జరిగేవి. ఆదివారాలు, ఎక్కడెక్కణ్ణుంచీ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని చూడటానికి వచ్చి ఆ పార్కులో కూచుండేవారు. ఆ ఒక్కరోజూ నా సహవిద్యార్ధులు వాళ్ల అక్కచెల్లెళ్లతో, అన్నదమ్ములతో ఆ పచ్చికలో కూచుని మాట్లాడుకుంటూ ఉండటం ఎంతో కమనీయంగా ఉండేది.
మా డైనింగ్‌హాల్లో, మా డార్మిటరీల్లో, మా తరగతి గదుల్లో ఆమె ప్రఖ్యాత భారతీయ చిత్రకారుల చిత్రలేఖనాల పటాల్ని తగిలించింది. చుట్టూ అవిరళమైన వెల్లవేసిన గోడలు, ఆ మధ్యలో ఒకటీ ఒకటీ వర్ణ చిత్రలేఖనాలు. వాటినట్లా చూడటంలో అనిర్వచనీయ మనోజ్ఞత ఉండేది.
అందులో ముఖ్యంగా రెండు వర్ణ చిత్రలేఖనాన్ని నేనిప్పటికీ మరవలేను. ఒకటి, అమృత షేర్‌గిల్ ‘ముగ్గురు అక్కచెల్లెళ్లు’ , రెండవది, కె.కె.హెబ్బర్ చిత్రం ‘కవిత్వం పుట్టుక’. ఆ రెండవ చిత్రం మీద తరువాతి రోజుల్లో నేనొక కవిత కూడా రాసాను.
ఆమె అక్కడితో ఆగకుండా మా దైనందిన చర్యలో చిన్న చిన్న మార్పులు, కాని విశిష్టమైన మార్పుల్ని చేసింది. మొదటిది, మా మార్నింగ్ ఆసెంబ్లీలో అన్ని పాఠశాలల్లో మాదిరి వార్తలు చదవడం కాకుండా ప్రతిరోజూ ఎవరైనా విద్యార్ధి తనకు నచ్చిన ఏదైనా అంశం మీద రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం ఏర్పరచింది. అదొక కొత్త వేకువ మాకు. ఆ అవకాశం వినియోగించుకోవడం కోసం మాలో చెలరేగిన తృష్ణ నిజంగా అపూర్వం.
నాకు బాగా గుర్తున్నది. నేను మహాప్రస్ధానం కావ్యంలోని ‘దేశచరిత్రలు’ కవిత మీద మాట్లాడిన సందర్భం. చెప్పడం మరిచాను. మా స్కూల్లో బేసిక్ టయ్రినింగ్ స్కూలుకి చెందిన మంచి లైబ్రరీ ఉండేది. అందులో ఒకరోజు అట్టలు చిరిగిపోయిన కవిత్వపుస్తకమొకటి నా కంటపడింది. ఆ విధంగా మహాప్రస్ధానం నా చేతుల్లోకి మొదటిసారి వచ్చింది.
అందులో చదవగానే నన్ను ఆకట్టుకున్న కవిత ‘దేశచరిత్రలు’. ఆ రోజు మార్నింగ్ అసెంబ్లీలో నేను దేశచరిత్రల గురించి మాట్లాడిన నాటి మధ్యాహ్న భోజన సమయంలో వెంకటరత్నం మాస్టారు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ‘ఎక్కడ పట్టావు ఆ కవితని, కంగ్రాట్స’ అన్నారు అందరూ వినేట్టుగా. ‘అయితే అది మార్క్సిస్టు దృక్ఫథం నుంచి రాసాడనుకో’ అని మార్క్సిజం గురించి చెప్పసాగారు. అదే మొదటి సారి, నేను మార్క్సిజమనే మాట వినడం.
ఇక మధ్యాహ్న భోజనానంతరం పాఠశాల దినచర్యలో మరికొన్ని మార్పులు, అంతదాకా ఆ స్ధానంలో ఉన్న సెల్ఫ్‌స్టడీని తీసేసి ఆ సమయంలో క్లబ్ యాక్టివిటీని ప్రారంభించారామె. క్లబ్ యాక్టివిటీ ప్రకారం పాఠశాలలోని పిల్లలంతా వారి వారి తరగతుల్తో నిమిత్తం లేకుండా వారివారి ఇష్టాల ప్రకారం కొన్ని క్లబ్బులుగా చేరవచ్చు. అందులో ముఖ్యమైనవి సైన్సు క్లబ్బు, సోషల్ క్లబ్బు, ఆర్ట్ క్లబ్బు, రైటింగ్ క్లబ్బు, మాథ్స్ క్లబ్బు.
ప్రతి ఒక్క క్లబ్బుకీ ఒక ఉపాధ్యాయుడు ఇంఛార్జిగా ఉంటాడు గాని ఆయన పాత్ర ఇప్పటి మాటల్లో చెప్పాలంటే కేవలం ఫెసిటిటేటర్ పాత్ర మాత్రమే. ఏ క్లబ్బు కి ఆ క్లబ్బు తన కార్యక్రమాల్ని తనే నిర్ణయించుకునేది. నెలపొడుగుతా తను చేపట్టిన కార్యక్రమాల్ని నెలలో ఒక రోజు తక్కిన పాఠశాల ముందు ప్రదర్శించేది. తల్లిదండ్రులు, సహ ఉపాధ్యాయులు నిరుత్సాహపరిచినప్పటికీ ఆమె క్లబ్బు యాక్టివిటీస్ విషయంలో ఏ రోజూ రాజీపడలేదు.
ఉత్తమ పాఠశాల కేవలం ఇంజనీర్లను, డాక్టర్లను, అధికారులను మాత్రమే తయారు చేసే కార్ఖానా కాదని, అక్కణ్ణుంచి కవులు, చిత్రకారులు, శిల్పులు, అభినయ వేత్తలు, అన్వేషకులు, జిజ్ఞాసువులు కూడా పెద్ద ఎత్తున రావలసి ఉంటుందని ఆమె మనసారా నమ్మింది. ఆమె నమ్మకానికి తగ్గట్లే క్లబ్బులు గొప్ప గొప్ప విజయాలే సాధించేయి.
ఆర్ట్ క్లబ్బులో చిత్రించిన బొమ్మలు వెల్లటూరు మొదలుకుని ఎక్కడ చిత్ర లేఖనం పోటీ జరిగితే అక్కడల్లా బహుమతులు గెల్చుకునేవి. స్పోర్ట్స్ క్లబ్బులో శిక్షణ పొందిన విద్యార్ధులు జిల్లా గ్రెగ్ పోటీల్లో, రాష్ట్రస్ధాయి పోటీల్లో పాల్గొనేవారు. సైన్సు క్లబ్బు విద్యార్ధులు తయారు చేసిన ఎగ్జిబిట్లు జిల్లా సైన్సు ఫెయిర్లలో మొదటి శ్రేణి బహుమతుల్ని పొందేవి. రైటింగ్ క్లబ్బు, దాన్ని కొన్నాళ్లు లిటరరీ క్లబ్బని కూడా పిలిచేవారు. నెలకొకరోజు పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది. ఆ పరిచయ కార్యక్రమంలో నేను ‘మాలపల్లి’ నవలని పరిచయం చేయడం నాకెప్పటికీ గుర్తే.
క్లబ్బు యాక్టివిటీ తరువాత కామన్ యాక్టివిటీ అవర్ ఉండేది. అది సాధారణంగా వివిధ క్లబ్బులు తాము చేసిన కార్యక్రమాల్ని తక్కిన విద్యార్ధులకు పరిచయం చేయడం కోసమే వాడుకునే సమయమయినప్పటికీ, ఒక్కొక్కప్ప్పుడు అది మమ్మల్ని అసాధారణంగా ఆశ్చర్యపరిచేది.
మా ప్రిన్సిపాలుగారు ఏ ప్రముఖవ్యక్తి గుంటూరు వచ్చినా లేదా అమరావతి వైపు వెళ్తున్నట్టు తెలిసినా వారిని వెంటనే స్కూలుకి ఆహ్వానించేవారు. వారితో ఆ కామన్ యాక్టివిటీ సమయంలో ముఖాముఖి లేదా ప్రసంగం ఏర్పాటు చేసేవారు. వావిలాల గోపాలకృష్ణయ్య, జంధ్యాల పాపయ్యశాస్త్రి, సంజీవదేవ్, బాలబంధు బి.వి.నరసింహా రావు వంటి వారిని మేం మొదటిసారి ఆ సందర్బంగానే చూడగలిగాం, వినగలిగాం.
ఆమె చేసిన మార్పుల్లో అన్నిటికన్నా ముఖ్యమైన మార్పు మా సాయంకాల సమావేశాల్ని ప్రార్ధనా సమావేశాలుగా మార్చడం. అంతదాకా, సాయంకాలం సరిగ్గా ఆరుగంటలకి విద్యార్ధులంతా ఆసెంబ్లీ గ్రౌండ్‌లో హాజరివ్వడానికి మాత్రమే సమావేశ మయ్యేవారు. ఆమె ఆ సమావేశ సమయాన్ని ముప్పైనిమిషాలకు పెంచి వాటి నిర్వహణని నరసింహారావుగారనే సీనియర్ ఇంగ్లీషు ఉపాధ్యాయులకు అప్పగించారు.
సాయంకాల ప్రార్ధనా సమావేశాలతో నరసింగరావు మాస్టారు కొద్ది రోజుల్లోనే తపోవన వాతావరణాన్ని తీసుకువచ్చేసారు. ఆ సమావేశాల్లో మొదట హిందూ, మహ్మదీయ, క్రైస్తవ ప్రార్ధనలుండేవి. ఆ తరువాత ప్రతిరోజూ ఒక శ్లోకం చొప్పున భగవద్గీతలోని సాంఖ్యయోగంలోని స్ధితప్రజ్ఞ శ్లోకాల పునశ్చరణ జరిగేది. కొన్ని రోజులపాటు కృష్ణభక్తి గీతాలాపన ఉండేది.
మరి కొన్నాళ్లు వెంకటరత్నమనే పిల్లవాడు గొంతెత్తి శ్రావ్యంగా ‘నడిపించు, నా నావా, నడిసాంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరియింప’ అనే గీతాన్నాలపిస్తూంటే విద్యార్ధులమంతా అతని వెంటనే గీతాలాపన చేసేవారు.ఆ చలికాలపు రాత్రుల్లో సాయంకాలాలు మా ఎదట పూలతోట మీద పొగమంచు అవరిస్తూ ఉండగా ఆ క్రిస్మస్ ఋతువంతా భక్తి గీతాలాపనతో మార్మ్రోగిన ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో నవనవంగానే కదలాడుతుంటాయి.
అటువంటి ఒక సాయంకాల ప్రార్ధనా సమావేశంలో నరసింగరావు ఎప్పుడూ కూచునే తిన్నె మీద కూచుని కనిపించలేదు. దానికి బదులుగా ఆయన ఎదటగా ఉన్న పార్కు బెంచీ మీద కూచుని కనిపించారు. ఎవరో చెప్పారు. ఆయనకి బదిలీ అయిందని. వెళ్లిపోతున్నారని, అతే. పిల్లలంతా ఆ ప్రార్ధనా సమావేశాన్ని శోకసంగీతంగా మార్చేసారు.
ప్రతి ఒక్కరి చెంపలూ కన్నీళ్లతో తడిసి ముద్దవుతూండగా ఆయన తమకి అంతదాకా నేర్పిన ప్రతి ఒక్క శ్లోకాన్నీ, ప్రతి ఒక్క గీతాన్నీ పిల్లలంతా ఏకకంఠంతో ఆలపిస్తూ ఉండిపోయారు. సాయంకాల సూర్యరశ్మి నెమ్మదిగా పశ్చిమదిశగా జారుకుంటూ చీకట్లు ముప్పిరిగొనడం మొదలయ్యింది. తెల్లని వస్త్రాల్లో పూర్వకాలపు ఋషీశ్వరుల్ని తలపించే ఆ ఉపాధ్యాయుడు ఆ పార్కు బెంచీ మీద నిశ్శబ్దంగా కూచుని ఉన్న ఆ దృశ్యాన్ని కూడా మరవడం కష్టం.
ఆమె చేపట్టిన వాటిల్లో మరొక ముఖ్య అంశం పాఠశాలలో వార్షికోత్సవాలు, జాతీయపండుగలు, వివిధ మతాలు పండుగలు పెద్ద ఎత్తున చెయ్యడం. ప్రతి పండగకి పాఠశాలలో పండగ వాతావరణం ఏర్పడేది. అది వినాయకచవితి కానివ్వండి, దీపావళి కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, స్కూల్లో ప్రత్యేక ఉత్సవం చేసేవారు. మామూలు మధ్యాహ్న భోజనం విందుభోజనంగా మారిపోయేది. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. నరకాసుర వధ లేదా క్రీస్తు జననాన్ని పిల్లలు రూపకాలుగా ప్రదర్శించేవారు.
అన్నిటిలోకి చెప్పవలసింది పాఠశాల వార్షికోత్సవాల్ని. స్కూల్ డే ఎప్పుడు జరుగుతుందో ఆనౌన్స్ చేసినప్పటి నుంచీ పిల్లలకి నిద్ర ఉండేదే కాదు. ఆటలపోటీలతో, వివిధ రకాల సాంస్కృతిక పోటీలతో దాదాపు రెండువారాల పాటు పాఠశాల హడావిడితోనూ, ఉద్వేగంతోనూ ఊగిపొయ్యేది. పిల్లలు కొందరు ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం బొమ్మలు గీస్తుండేవారు. కొందరు పిల్లలు కొత్త నాటకాల్ని రిహార్సల్ చేస్తుండే వారు. వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్‌లు జరుగుతుండేవి. ఆటల పోటీల కోసం టీములు తయారవుతుండేవి.
పాఠశాల వార్షికోత్సవాలకు ప్రముఖులెవరో ఒకరు ముఖ్య అతిథిగా వస్తుండే వారు. ఆ కోలాహలం, ఆ కలకలం చెప్పనలవి కాదు. వార్షికోత్సవాల నాటి రాత్రి ఇచ్చే విందు మరీ ప్రత్యేకంగా ఉండేది. దాన్ని ఎవ్వరూ మరవగలరనుకోను. తిరిగి 2002 లో పాఠశాల రజతోత్సవ వేడుకలు చేసినప్పుడు మల్లా ఆనాటి వాతావరణం మరొక్కసారి పునః ప్రత్యక్షమయింది.
సాధారణంగా ఉన్నత పాఠశాలల్ని వార్షిక తనిఖీల పేరిట పేనల్ ఇనస్పెక్షన్ టీమ్‌లు సందర్శించడం పరిపాటి. కాని మా ప్రిన్సిపాలు గారు అటువంటి చిన్న స్ధాయి పేనళ్లతో తృప్తి చెందలేదు. ఆమె ప్రత్యేకంగా యూనివెర్సిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేసిన బృందాలతో మా పాఠశాల తనిఖీ చేయించింది. అటువంటి ఒక తనిఖీ నాకింకా గుర్తే. మా సోషల్ స్టడీస్ పాఠాన్ని వెంకటరత్నంగారు బోధిస్తుండగా శ్రీ వెంటేశ్వర విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ కమలనాథన్ ఆ బోధనని పర్యవేక్షించారు. అది తొమ్మిదవ తరగతిలో సామ్యవాదం పాఠం.
విశేషమేమిటంటే ఆ తొమ్మిదవ తరగతి సోషల్ స్టడీస్ వాచకానికి కమల్ నాథన్‌నే సంపాదకత్వబాధ్యత వహించారు. ఆ రోజు వెంకటరత్నంగారు తన సహజ పద్దతిలోనే పాఠాన్ని బోధించారు. ఆ తరగతిని ఆద్యంతం పరిశీలించిన ప్రొఫెసర్ మాత్రం తరగతి పూర్తి కాగానే లేచి నుల్చుని అభినందనపూర్వకంగా కరతాళ ధ్వని చేసాడు. ‘అపూర్వం, ఇటువంటి బోధన యూనివెర్సిటీలో ఎమ్మే విద్యార్ధులకి కూడా లభించదు’ అన్నాడాయన.
మా పాఠశాలకు బేసిక్ ట్రయినింగ్ స్కూలు లైబ్రరీ లభించిందని చెప్పాను కదా. అందులో నేను నేషనల్ బుక్ ట్రస్ట్ వారి అనువాదాలు, దక్షిణ భారత పుస్తక ప్రచురణ వారి పుస్తకాలు, స్వామి వివేకానంద రచనలు చదివాను. మా ప్రిన్సిపాలు గారు ఆ లైబ్రరీని పెంచి దానికొక విస్తృతమైన రీడింగ్ రూంని ఏర్పాటు చేసారు. అందులో దాదాపు పాతిక రకాల పత్రికలు వచ్చేవి. వాటిని పెద్ద పెద్ద ఫోల్డర్లలో పెట్టి షెల్ప్‌లో డిస్‌ప్లే చేసేవారు. ఆ తరువాత గంటల తరబడి ఆ పఠనమందిరంలోనే గడిపేవాడినని వేరే చెప్పాలా?
క్రీడల పట్ల మా ప్రిన్సిపాలుగారికున్న ఇష్టం చాలా ప్రత్యేకమయింది. ఆమెకి అత్యంత ప్రీతిపాత్ర అంశాల్లో మాస్ డ్రిల్ ఒకటి. మా ఫిజికల్ డైరక్టర్ పాపయ్యరాజుగారు బాండ్ వాయిస్తుంటే ఆ రిథమ్‌కి అనుగుణంగా పిల్లలు తెల్లని స్పోర్ట్స్ యూనిఫాంలో డంబెల్స్‌తో, రైజ్ అండ్ రెజూమ్స్‌తో, రంగురంగుల ఫ్లాగ్స్‌తో షూస్ డ్రిల్ చేస్తుంటే, చూడటం నిజంగా అనుభవం.
నెమ్మదిగా పిల్లలు క్రికెట్ పట్ల విపరీతమైన వ్యామోహాన్ని పెంచుకున్నారు. మా స్కూలుకొక చిన్న క్రికెట్ టీం కూడా తయారయ్యింది. అన్ని క్రీడల్నీ వదిలి పిల్లలు క్రికెట్ వెంట పడటాన్ని ఇష్టపడని ఉపాధ్యాయులు పిల్లలతో బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్ ఆడి ప్రోత్సహిస్తుండేవారు.
ఇంకా చెప్పవలసింది మా ప్రిన్సిపాల్‌గారి సంగీతాభిరుచి. ఆమె మా కోసం పాఠశాలకొక అపూర్వ సంగీత విద్వాంసుణ్ణి నియమించడమే కాక ప్రతి తరగతిలో కొన్ని సంగీతం తరగతుల్ని కంపల్సరీ చేసారు.
స్కూల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టం ఉండేది. దానిలో ప్రతి ప్రభాతానా కీర్తనలు, సెలవు దినాల్లో పాటలు వినిపించేవారు. రోజూ మేం ప్రేయర్ అసెంబ్లీకి మార్చ్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఆ సిస్టమ్‌లో దేశభక్తి గీతాలు వినిపించేవారు.
ఆమెకి చాలా బలంగా ఉండే చాదస్తాల్లో పిల్లల ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యమైంది. మా పాఠశాలకొక క్లినిక్ రూం, స్టాఫ్‌నర్స్ ఉండేవారు. ప్రతిరోజూ ఆమె పొద్దున్న సరిగ్గా ఆరూ నలభై అయిదు నిమిషాలకి ఆ సాఫ్ట్ నర్స్ వెంట రాగా ప్రతి డార్మిటరీ ముందు కిట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించేవారు. (అద్భుతమైన ఈ సంప్రదాయాన్ని నేడు ఏ పాఠశాల కూడా నిర్వహిస్తున్నట్టు కనబడదు).
అందులో ప్రతి డార్మిటరీ ముందు ఆ బోర్డర్లు, వారి హౌజ్ మాస్టర్లు హాజరుగా ఉండాలి. ఆమె ప్రతి డార్మిటరీకి వచ్చి ప్రతి పిల్లవాడినీ వాడి దంతాలు, గోళ్లు, నాలుక, జుత్తూ, దుస్తులూ, శుభ్రంగా ఉన్నాయో లేదో పరిశీలించేది. ఎవరు శుభ్రంగా లేకపోతే వాడిని అక్కడికక్కడే డిస్‌క్వాలిఫై చేసేసేది. పైగా అది ఆ హౌజ్ మాస్టరుకొక రిమార్కు కూడా.
ఆమె వెనుక ప్రతి రోజూ ఇద్దరు స్టూడెంట్లు కూడా అనుసరించేవారు. ఆమె తనిఖీని బట్టి వాళ్ళు ప్రతి హౌజ్‌కి మార్కులు వెయ్యాలి. ఆ మార్కుల్నిబట్టి బెస్ట్‌హౌజ్‌ని నిర్ణయించి ఆ రోజు మార్నింగ్ అసెంబ్లీలో అనౌన్స్ చేసేవారు. నేనూ, నా సహాధ్యాయి సోమయాజులూ ఆమెని అలా చాలా రోజులు అనుసరించిన భాగ్యానికి నోచుకున్నాం.
పాఠశాల నిర్వహణకి సాధారణంగా పాఠశాలల్లో క్లాస్ పుపిల్ లీడర్ (సి.పి.ఎల్), అన్ని క్లాసులకూ కలిపి స్కూలు పుపిల్ లీడర్ (ఎస్.పి.ఎల్) ఉండటం పరిపాటి. కాని ఆ సాధారణ శక్తిహీన పద్ధతి ఆమెకి నచ్చలేదు.
అందుకు బదులు మా పాఠశాలలో ఆమె కేబినెట్ వ్యవస్ధని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం పాఠశాల పరిపాలనలో దైనందిన అంశాల పాలన చాలావరకు విద్యార్ధులకే బదలాయించబడింది. వాటి నిర్వహణకు గాను పాఠశాలకొక ప్రధానమంత్రి (పి.ఎం) ఉంటాడు. అతనితో సహా పదిమందికి తక్కువ కాకుండా అతని కేబినెట్ సహచరులు కూడా విద్యార్ధుల నుంచే ఎంపిక కాబడి ఉంటారు. నెలకొకసారి వారు జరుపుకునే కేబినెట్ మీటింగ్‌కి ప్రిన్సిపాల్‌గారితో సహా హౌజ్ మాస్టర్లంతా హాజరయ్యేవారు. పాఠశాల క్రమశిక్షణలో, పరిసరాల పరిశుభ్రతలో ఆరోగ్యసంరక్షణలో వివిధ కేబినెట్లు చేసిన సేవ మరువలేనిది.
సాధారణంగా విద్యని కులీనీకరించాలనే ప్రతి సమాజమూ కోరుకుంటుంది. తమ పిల్లలకి బాగా చదువు రావాలంటే బాగా ఫీజు వసూలు చేసే పాఠశాలలో చేర్పిస్తే చాలనే ప్రతి తండ్రీ భావిస్తాడు.
కాని పాఠశాలని ఉత్తమ పాఠశాలగా మార్చేది అందులోని భవనాలూ, సౌకర్యాలూ కాదు. లేదా కేవలం ఆకడమిక్ ప్రాక్టీసెస్ మాత్రమే కావు. ఆ పాఠశాల ఎటువంటి ప్రాసెస్‌లని నమ్మిందీ, వాటికోసం ఎంత కాలాన్ని వెచ్చించిందీ అన్నది కూడా అంతే ముఖ్యం.
నేను పైన చెప్పిన ప్రాసెస్‌లలో ముఖ్యమైనవేవీ ఈ రోజు తాడికొండ పాఠశాలతో సహా ఏ ఒక్క గురుకుల పాఠశాలలో కూడా కనరాకపోవచ్చు. కాని వాటన్నిటినీ, నేను వివరించిన దానికన్నా కూడా బాగా, ఒక పాఠశాల ఒకప్పుడు ఆచరించి రుజువు చేసిందని గ్రహిస్తే చాలు. సాధారణ గ్రామీణ విద్యార్ధుల పాఠశాలకి ముఫ్పైయ్యేళ్ల కిందట సాధ్యమైన ఆ నడవడి ప్రయత్నిస్తే, ఇప్పుడు కూడా ప్రతి పాఠశాలకూ సాధ్యమవుతుందని మనం నమ్మగలిగితే చాలు.
7
Mrs. K.M.Suguna
K.M. Suguna was a visionary uniquely driven by a passion to transform the school into a crucible for drawing out the multifaceted, latent potentials of her students. She possessed a rare, harmonious blend of classical Greek intellectual curiosity, the expansive humanistic sensibilities of the Renaissance, and a sharp, modern technological awareness. It would be no exaggeration to assert that the formidable administrative genius she displayed would be difficult to replicate even among seasoned university Vice-Chancellors.
Though the intimate details of her personal life remain entirely unknown to me, it is impossible to envision what shape my own destiny would have taken had my four formative years of education not occurred under her direct stewardship. My mother’s formal education had ceased at the fifth grade. Yet, if one were to imagine a mother holding a postgraduate degree in education, serving for decades as a distinguished District Educational Officer, and presiding over a premier high school as its Principal—that precisely captures the protective, elevated atmosphere of my education at Tadikonda.
There were undoubtedly countless students who looked upon Mrs. Suguna as a revered maternal anchor. Yet, if there ever existed a small circle of children she quietly held closest to her heart, I remain firmly convinced that my name occupied the very top of that ledger.
Why did she bestow such extraordinary affection upon me? I can only surmise that she recognized in my character the raw, malleable metal required to validate her deepest pedagogical conviction: that a school is the ultimate sculptor of a child’s holistic development. At times, however, this relentless attention felt profoundly suffocating.
I paid a punishing price for being the chosen pupil of a Headmistress whose fierce discipline made both seasoned instructors and senior students tremble. Within a classroom of nearly thirty peers, barely two or three ever dared to speak to me. I was forced to navigate the cold currents of their unprovoked jealousy and deep-seated resentment every single day.
The weight of an intensifying homesickness on one hand, coupled with the absolute alienation from my classmates on the other, gradually shrunk the school into a narrow, psychological prison. Yet, the novel opportunities Mrs. Suguna relentlessly sought on my behalf, and the demanding assignments she continually thrust upon me, gradually taught me an invaluable lesson: how to not merely endure suffering, but to transfigure pain into a life-defining challenge.
While Mrs. Suguna sustained the uncompromising structural discipline established by her predecessor, C.S. Rao, their methodologies reflected two entirely different philosophies. C.S. Rao’s discipline resembled the rigid, external mechanics of a military encampment; hers, conversely, felt like the enlightened, internal commitment of a voluntary service camp. She possessed the rare gift of teaching us to fall in love with order. For someone like me, who had stepped directly out of the wild, unstructured lap of the forest into the formal confines of an academy, this regimentation initially felt entirely stifling.
Slowly, however, I began to perceive that this order was not an artificial cage, but rather mirrored the profound submission of a wild forest yielding beautifully to the cyclical rhythms of the seasons. She would frequently repeat a maxim without ever betraying a hint of exhaustion: “Education is secondary; formal learning will find its way to you somehow. It is character and discipline that endure.”
“What constitutes true patriotism?” she would often inquire, pausing intentionally to command the room. I had heard her exposition on this question numerous times, yet on each occasion she articulated it, the truth felt startlingly luminous and new.
She would tell us: “Patriotism does not merely demand the ultimate sacrifice of your life on a distant battlefield. Imagine you are walking along a school pathway and your eyes fall upon a stray piece of litter on the grounds. Believe me when I tell you that there is no greater act of devotion to your motherland than bending down, picking up that fragment of refuse, and depositing it safely into the bin.”
She would add, with equal conviction: “If you are washing your hands outside the dining hall and notice water needlessly hemorrhaging from an unclosed tap, and you find yourself incapable of walking away without turning it off—you have learned to love your country. And at night, when you are returning to the dormitories from late-night self-study, whoever lingers as the last soul in the room to systematically extinguish the lights and fans—that individual is practicing true patriotism.”
At that transitional, impressionable age, living in a sprawling community of nearly six hundred students and over thirty instructors, we naturally whispered among ourselves, claiming she was pathologically obsessed with regimentation. We spun a thousand legendary tales around her strictness. Because her public discourse centered so heavily on this doctrine, it was easy for a superficial observer to assume her vision was entirely monochromatic, focused solely on control. But that was a profound misjudgment.
Beneath that formidable exterior beat a deeply artistic, aesthetic heart. The innovative experiments she initiated to transform the mundane, routine schedule of institutional life into a vibrant, joyful celebration were beyond count. In that specific regard, I have never encountered another educator who could match her genius. This was the living embodiment of my thesis: the radical displacement of mechanical routine by creative vitality. The diverse paths through which she orchestrated this transformation defy simple cataloging.
Her first act of aesthetic resistance was to reclaim the barren, neglected expanse of land directly facing our school building and transform it into a magnificent botanical park. She personally sketched a sophisticated landscape design, filling the space with rows of blooming roses, vibrant oleanders, and pristine crape jasmine. The entire grounds were carpeted in lush, manicured green lawns, interspersed with inviting benches. In the quiet hours of the evening, children would gather there to sit and reflect.
As the setting sun cast its long, amber rays across the grass, the quiet preparations for our evening assembly would commence. On Sundays, when parents traveled from distant villages to visit their children, the park became a theater of reunion. On those specific days, it was a deeply moving sight to witness my classmates sitting peacefully upon the grass, locked in quiet conversation with their brothers and sisters.
Within the shared spaces of our dining hall, the dormitories, and the classrooms, she took the radical step of hanging high-quality prints of masterpieces by celebrated Indian artists. Framed against the stark, plain whitewashed walls, these vivid explosions of color stood out with arresting brilliance, imparting an indescribable charm to our daily lives.
Two specific paintings etched themselves so deeply into my consciousness that they became permanent landmarks of my internal landscape: Amrita Sher-Gil’s hauntingly soulful Three Girls, and K.K. Hebbar’s deeply evocative Birth of Poetry—a masterpiece that, in my later years, would inspire me to compose a dedicated poem.
Her reforms quickly permeated our daily scholastic routine. In the morning assembly, completely discarding the uninspired, robotic practice of merely reading the daily news headlines aloud, she engineered a sacred two-minute window for a student to stand before the entire school and speak on a topic born of their own intellectual choosing. This single innovation marked a glorious new dawn for us. The fierce, burning aspiration that ignited within our student body to seize that brief moment at the podium was truly unprecedented.
I retain a vivid, crystalline memory of the morning I stood before the assembly to speak on Desa Charitralu (Histories of Nations) from the legendary anthology Maha Prasthanam. I should mention that our institution had inherited a magnificent library from the old Basic Training School. It was there, exploring the dusty shelves one afternoon, that I stumbled upon a volume of poetry with torn covers; that was how Maha Prasthanam first entered my life.
Among its revolutionary pages, the poem that instantly captivated my soul was Desa Charitralu. Following my presentation at the assembly, my social studies teacher, Mr. Venkatratnam, deliberately sought me out during the lunch hour. “Where on earth did you unearth that masterpiece? My heartfelt congratulations,” he remarked, his voice echoing loudly enough to command the attention of the entire corridor. “But remember,” he added with a sharp, discerning smile, “it is articulated from a rigorous Marxist perspective.” He then proceeded to deconstruct the tenets of Marxism for me. That afternoon marked the very first time my ears ever encountered that monumental word.
Further structural shifts reordered our afternoon schedule. She completely abolished the conventional, uninspired self-study periods, replacing them with a dynamic system of “Club Activities.” Under this decentralized framework, students across all age groups were liberated to join specialized guilds aligned with their true passions—ranging from the Science and Social Clubs to Art, Writing, and Mathematics.
An instructor presided over each club, though their operational role, in contemporary terms, was strictly that of a facilitator. Each collective possessed absolute autonomy to determine its own creative agenda, culminating in a monthly showcase presented to the entire assembled school. Even when anxious parents and conservative colleagues actively discouraged her, arguing against this departure from routine, she refused to offer a single compromise on these creative spaces.
She harbored an unshakeable conviction that a genuine school is not an industrial factory designed to mass-produce standardized engineers, physicians, and bureaucrats, but rather a sacred soil from which poets, painters, sculptors, actors, explorers, and authentic seekers of truth must emerge in abundance. Validating her profound faith, these clubs achieved spectacular success.
Masterpieces emerging from the Art Club consistently swept prestigious accolades in exhibitions from Vellatur to distant competitions. Athletes trained within the Sports Club asserted their dominance in regional tournaments and state-level events. Scientific apparatuses constructed by the Science Club secured first-class honors at regional science fairs. Meanwhile, the Writing Club—often referred to as the Literary Society—convened an intense monthly book review forum. The memory of standing before that critical circle to review Unnava Lakshminarayana’s pathbreaking novel Malapalli remains permanently engraved in my mind.
Directly following these guild sessions was the Common Activity Hour. While this slot was primarily reserved for clubs to showcase their monthly creations, it frequently delivered extraordinary, unexpected encounters.
Whenever a figure of intellectual or historical eminence visited Guntur or was known to be traveling toward the historic ruins of Amaravati, our Principal would personally intercept them, extending an immediate invitation to our campus. She would organize intense, face-to-face dialogues or public addresses during this hour. It was through these spontaneous encounters that our young eyes and minds first encountered legendary figures like the venerable freedom fighter Vavilala Gopalakrishnayya, the celebrated classical poet Jandhyala Papayya Sastry (Karunasri), the profound aesthetic philosopher Sanjeevadev, and the pioneer of children’s theatre, Balabandhu B.V. Narasimha Rao.
Yet, the most profound and spiritually enduring of all her structural innovations was the transfiguration of our mundane evening roll-call into a deeply meditative prayer assembly. Until her intervention, the student body merely assembled at precisely six o’clock on the dusty grounds to have their attendance mechanically recorded. She extended this window to a dedicated thirty minutes, entrusting its spiritual stewardship to a veteran, scholarly English teacher named Narasinga Rao.
Within a matter of days, Mr. Narasinga Rao succeeded in imparting the serene, elevated atmosphere of an ancient Vedic grove to these twilight gatherings. The assemblies commenced with a harmonious synthesis of Hindu, Muslim, and Christian prayers, followed by the collective, daily recitation of the timeless shloka delineating the Sthitaprajna (the individual of unwavering, steady wisdom) from the Sankhya Yoga of the Bhagavad Gita. On many evenings, this was accompanied by deep, choral devotional singing.
On certain magical nights, a student named Venkatratnam would lead with his exceptionally melodious voice, singing:
“Nadipinchu Na Nava Nadisamdramuna Deva / Navajeevana Margamuna Na Janma Tariyimpa”
(“Steer my fragile vessel, O Lord, across the raging oceans of existence; let my mortal life find its ultimate fulfillment upon the path of a new dawn,”)
Immediately, hundreds of young voices would rise in unison, echoing his plea into the gathering dusk. The memory of those crisp winter evenings, with a gentle mist settling softly over the blooming rose gardens before us, while the entire landscape of the Christmas season vibrated with the ethereal resonance of carols, will remain eternally fresh and untainted within my soul.
I recall one poignant evening when Mr. Narasinga Rao did not occupy his accustomed place upon the elevated speaker’s platform. Instead, he sat quietly on a solitary park bench directly opposite our ranks. A whisper rippled through the student body that his transfer orders had arrived; he was leaving us. In an instant, the children spontaneously transformed the structured prayer assembly into a collective, mournful elegy.
With tears streaming down hundreds of young faces, the students sang, in perfect, heartbreaking unison, every single shloka, hymn, and chant that this beloved teacher had ever gifted them. The evening sun slowly slipped beneath the western horizon, and the shadows of darkness began to envelop the campus. It remains impossible to erase the memory of that noble instructor, draped in immaculate white raiment, resembling an ancient, silent rishi, sitting motionless upon the park bench as the night claimed the sky.
Another monumental initiative she pioneered was the scale and grandeur with which the school celebrated institutional anniversaries, national holidays, and the sacred festivals of all major religions. Every festival infused the campus with an almost ecstatic aura of joy. Whether it was Ganesh Chavithi, Diwali, or Christmas, a dedicated, elaborate celebration was staged. The standard, utilitarian afternoon meal was transformed into a magnificent feast, yielding to rich cultural programs in the evening. Students would immerse themselves in performing elaborate plays depicting the mythical slaying of Narakasura or the nativity of Christ.
Most legendary, however, were the school’s Annual Day celebrations. From the precise moment the date of the School Anniversary was formally announced, sleep vanished from the dormitories. For nearly a fortnight, the entire campus buzzed with the electric energy of athletic tournaments and intense creative rehearsals. Certain children locked themselves away to draw for the annual art exhibition, while others spent long hours rehearsing new theatrical scripts. Fierce elocution, essay-writing, and quiz championships clashed daily, while sports teams strategized for glory.
For the grand finale of the Annual Day, our Principal ensured that a luminary of national or intellectual stature always graced the occasion as the Chief Guest. The collective euphoria and excitement of those nights defy description. The celebratory banquet served on the night of the anniversary was an experience of such culinary and communal joy that it remains permanently bracketed in memory. Decades later, when the institution celebrated its historic Silver Jubilee in 2002, that exact, electric atmosphere rose from the ashes of time, coming vibrantly alive once more.
Conventionally, high schools are subjected to routine, localized panel inspections for standard bureaucratic compliance. Our Principal, however, harbored a deep contempt for such pedestrian administrative checks. She bypassed the standard bureaucratic channels and specially arranged for eminent university professors to personally conduct the academic inspections of our school.
I retain a vivid memory of one such historic review. While our brilliant teacher, Mr. Venkatratnam, was delivering a social studies lecture to our ninth-grade class, Professor Kamalanathan, the legendary Chair of Political Science from Sri Venkateswara University, sat quietly in the back, meticulously observing the pedagogy. The topic of the day was a complex lesson on the philosophy of Socialism.
The extraordinary irony of that hour lay in the fact that Professor Kamalanathan himself was the primary editor of that very ninth-grade national textbook. That morning, completely unfazed by the eminence of his auditor, Mr. Venkatratnam delivered the discourse in his signature, electrifying style. After quietly absorbing the entire hour, the university professor slowly stood up at the back of the classroom and broke into resounding applause. “Astonishing,” he remarked with deep emotion. “Even the postgraduate M.A. students at the university are rarely privileged to receive instruction of this intellectual caliber.”
As I noted earlier, our school had inherited the extensive library of the old Basic Training School. It was within that sanctuary that I devoured the foundational translations published by the National Book Trust, the diverse catalog of the South India Book Trust, and the complete, fiery corporate works of Swami Vivekananda. Our Principal systematically expanded this repository, establishing a spacious, light-filled reading room. It subscribed to no less than twenty-five diverse periodicals and literary magazines, beautifully displayed in large wooden folders across dedicated shelves. It goes without saying that I spent countless, silent hours losing myself within that room.
Our Principal also harbored a deep, almost romantic passion for athleticism and sports. One of her most cherished spectacles was the grand mass drill. While our Physical Director, Mr. Papayya Raju, commanded the brass band, hundreds of children, dressed in immaculate white sports uniforms, would execute the intricate shoe drill, dumbbell routines, rise-and-resumes, and synchronized formations with colorful flags, all moving in flawless, rhythmic harmony to the cadence of the music. To witness that sea of white moving across the green field was an unforgettable aesthetic experience.
Gradually, the student body developed an intense passion for cricket, leading to the formation of a dedicated school team. Instructors who looked askance at this new obsession, fearing the boys would abandon traditional sports, actively countered it by encouraging and fortifying the clubs for ball badminton and tennikoit.
I must also pay homage to our Principal’s refined sensibility for the musical arts. Not only did she recruit an extraordinary, classically trained music instructor for the campus, but she also took the bold step of making formal music education a compulsory, non-negotiable part of the curriculum for every single grade.
The campus was wired with a comprehensive public address system. Every morning, soul-stirring devotional melodies were broadcast across the grounds to wake the campus, while classic cinematic compositions played on holidays. And each afternoon, as our long columns marched in disciplined formation toward the prayer assembly, stirring patriotic anthems echoed over the loudspeakers, keeping time with our steps.
Among her ironclad, non-negotiable mandates, the healthcare and physical well-being of the children occupied a position of paramount importance. The school maintained a dedicated medical clinic staffed by a resident nurse. Every single morning, at precisely 6:45 AM, accompanied by the staff nurse, the Principal would personally conduct a rigorous “Kit Inspection” in front of each dormitory—a profound, beautiful tradition of holistic care that seems to have vanished entirely from contemporary education.
The boarders and their respective Housemasters were required to stand in immaculate ranks outside their dormitories. She would walk down the line, inspecting every individual child to ensure their teeth, nails, tongue, hair, and attire were pristine. If a single child was found wanting in cleanliness, she would disqualify them on the spot—an action that instantly translated into a severe negative mark against the record of the Housemaster.
She was shadowed daily by two student evaluators who recorded marks for each house based on her strict verdict. At the morning assembly, these tallies culminated in the highly anticipated announcement of the ‘Best House’ trophy. My classmate Somayajulu and I were uniquely fortunate to be chosen as the student evaluators who followed her on these morning rounds for many months.
In standard educational institutions, it is common practice to appoint a singular Class Pupil Leader (CPL) or a School Pupil Leader (SPL)—a pedestrian, bureaucratic system that she dismissed as entirely spiritless.
In its place, she introduced a highly sophisticated, autonomous Cabinet System of student governance. Under this framework, the day-to-day administrative machinery of the school was largely transferred directly into the hands of the students themselves. A student Prime Minister was democratically elected by the body, who then appointed a functioning cabinet of no less than ten student ministers. The Principal and all the Housemasters attended their intensive monthly cabinet meetings strictly as observers. The stellar service rendered by these successive student cabinets in maintaining campus discipline, environmental sanitation, and peer healthcare remains an unforgettable testament to her faith in democratic responsibility.
It is a tragic truth that modern societies consistently strive to render education an elitist, commodified privilege. The contemporary father operates under the illusion that to secure a profound education for his child, it is sufficient to enroll them in an expensive academy that charges exorbitant fees.
Yet, the true greatness of a school is never forged by the architectural opulence of its buildings, the luxury of its facilities, or the mere efficiency of its academic drills. What matters fundamentally are the deeper human processes the school believes in, and the sacred temporal spaces it dedicates to their manifestation.
Perhaps none of the transformative, life-giving processes I have chronicled here can be witnessed in the Gurukulams of today—including the contemporary incarnation of Tadikonda. Yet, it is more than enough for us to recognize and remember that a single school once practiced, perfected, and validated every single one of them, perhaps with an elegance far surpassing my own humble descriptions. If we can retain the radical faith that the luminous work culture achieved thirty years ago by an ordinary school for rural children remains entirely possible for every school today—if we can believe in that possibility, it is more than enough.
10-7-2026


An invaluable lesson: how to not merely endure suffering, but to transfigure pain into a life-defining challenge.
“Education is secondary; formal learning will find its way to you somehow. It is character and discipline that endure.”
Such a noble institute of yester years, it was.
Thank you so much!
పాఠశాల నిర్వహణ ఎలా ఉండాలో అనే ఆలోచనే లేని స్కూల్స్ ఉన్న ఈరోజుల్లో ఇలా పాఠశాల నడపాలి అని ఆశించటం అత్యాశ.
ఎంత బాగుందో …పాఠశాల.
హృదయపూర్వక ధన్యవాదాలు.
నేను చదివిన మీ మొదటి పుస్తకం. పాఠశాల గ్రంథాలయంలో దొరికిన అపురూపం ఈ పుస్తకం. విద్యా వ్యవస్థ గురించి, అందులోని మంచి చెడుల గురించి ఇంతవరకూ ఎవరూ ఆలోచించలేదా అని ఎన్నోసార్లు మధన పడ్డ నాకు దొరికిన విలువైన వజ్రం ఈ పుస్తకం. ఎన్ని విషయాలు చెప్పారు, ఎంత ప్రయాణం… మళ్ళీ ఇలా అందరికీ చేరువగా రావడం బావుంది. మిమ్మల్ని నాకు పరిచయం చేసిన ఈ పుస్తకానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు సర్ 🙏🏼
హృదయపూర్వక ధన్యవాదాలు.
Sir, this is almost too ideal a school to believe actually existed.
నిన్న మీరు చెప్పిన standards ప్రకారం నేను చదివిన school ని వెతుక్కున్నాను. చాలానే కనిపించింది అన్నాను. I have to take that back. 😄
ఈ భాగం చదివాక, మీరు వర్ణించిన మీ ఈ school కి దగ్గర దరిదాపుల్లో కూడా మా school కనిపించలేదు.
సుగుణ మేడమ్ లాంటి educators వున్నారా ఇప్పుడు?!
After-school clubs, activity hour, art and music as part of school life, eminent personalities visiting the school, prayer meetings with prayers and songs from different religions, school day celebrations, art exhibitions, cultural events, various competitions, library, reading rooms, sports, daily health checks for every student, and above all, that amazing cabinet system with students actually participating in school administration.
Every single thing sounds so thoughtful and purposeful. They created an ideal environment for an all round development of a child.
నిజంగా ఆదర్శవంతమైన పాఠశాల గా మీరున్న ఆరేళ్ల లో మీ పాఠశాల transform అయిందని చెప్పారు, ఈ భాగం చదువుతుంటే అది స్పష్టంగా కనిపించింది.
ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో కూడా ఇలాంటి programs లేవంటే చాలా బాధ కలుగుతుంది.
🙏🏽
మీ సహృదయ స్పందనకు అనేక ధన్యవాదాలు.
అలాంటి రోజుల్లో ఆ పాఠశాలకు నేను కూడా వెళ్లి ఒక రాత్రి గడిపిరావడం నా అదృష్టం. జై ఆంధ్రా మూమెంట్ లో బహిరంగ సభల కోసం జనం విజయవాడ వేపు తరలి వస్తున్నప్పుడు దానికి ఎదురుగా గుంటూరు వేపు చేసిన ప్రయాణం అది. అలా సుగుణ గారిని చూడగలిగాను. ఇప్పుడు మరింత స్పష్టంగా.
అవును. నువ్వు వచ్చి వెళ్లిన ఆ ఒకరోజు ఒక కథగా రాయవలసి ఉంది.