ఒంటరి చేలమధ్య ఒక్కత్తే మన అమ్మ

చాలాకాలంగా మిత్రుడు వాసు నా రెండవ కవితా సంపుటి ‘ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ (1995) మళ్ళీ ప్రచురించమని అడుగుతూ ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడూ ఆ పుస్తకం గురించి రాస్తూ వచ్చిన ప్రస్తావనలు చదివి మరికొంత మంది మిత్రులు కూడా ఆ పుస్తకం కోసం అడుగుతూ ఉన్నారు.

సోమయ్యకు నచ్చిన వ్యాసాలు

2001 నుంచి 2004 దాకా ఇండియా టుడే తెలుగులో 'సాలోచన' పేరిట రాసిన వ్యాసాలూ, 2009 లో నవ్యవారపత్రికలో 'పూలు పూసిన దారుల్లో' పేరిట రాసిన వ్యాసాలూ, మిసిమి, భక్తి మొదలైన పత్రికల్లో రాసిన వ్యాసాలతో పాటు కొన్ని ముందుమాటలు, సమీక్షలు, ప్రసంగపాఠాలూ ఏరి కూర్చిన సంకలనం. రావెల సోమయ్య, అరుణ దంపతులకు అంకితం.

మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి

21 వ శతాబ్దంలో విద్య స్వరూప స్వభావాలు మారుతున్న వేళ, కొత్త శతాబ్దం మొదలుకాగానే, విద్యార్థులకి విద్యాలక్ష్యాల గురించి తెలియచెప్పే ఉద్దేశ్యంతో వాడ్రేవు చినవీరభద్రుడు వెలువరించిన మూడు చిన్నపుస్తకాలు 'మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి?', మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి?' మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి?.