ఇంతవరకు వెలువరించిన కవితాసంపుటాల్లో ఆరవది. 2014 నుంచి 2018 మధ్యకాలంలో రాసిన యాభై కవితల సంపుటి. ఈ పుస్తకం ఆత్మీయుడు రాళ్ళబండి కవితాప్రసాద్ స్మృతికి అంకితం.
నీటిరంగుల చిత్రం
2009 నుంచి 2014 మధ్యకాలంలో రాసిన 182 కవితల సంపుటి. కవిత్వం మాటల్నే ఆశ్రయించుకుని ఉన్నప్పటికీ అది మాటల్లో మాత్రమే లేదనీ, విద్యుచ్ఛక్తి రాగితీగలోపలనుంచి కాకుండ రాగితీగ వెంబడి ప్రసరించినట్టే కవిత్వం కూడా మాటల్లోంచి కాకుండా మాటల చుట్టూ ప్రసరిస్తుందనే గ్రహింపు ఈ కవిత్వం పొడుగునా కనిపిస్తుంది.
కోకిల ప్రవేశించే కాలం
ఇంతదాకా వెలువరించిన కవితాసంపుటాల్లో నాలుగవది. 2000-2009 మధ్యకాలంలో రాసిన 103 కవితల సంపుటి. ఈ సంపుటానికి 2010 సంవత్సరానికిగాను ఇస్మాయిల్ పురస్కారం లభించింది.
