ఇక ఆ కవిత్వమంతా ఒక అనాహతనాదం భృంగధ్వనిలాగా తరంగితమవుతూనే ఉంటుంది. అది భాషమీద ఆధారపడ్డదే అయినా భాషాతీతం కూడా. తన బెంగాలీ గీతాల్లోని సంగీతాన్ని టాగోర్ గీతాంజలి ఇంగ్లీషు అనువాదాల్లోకి తీసుకురాడానికి ప్రయత్నించినట్టు నేను కూడా ఆ సంగీతాన్ని తెలుగులోకి తేడానికి ప్రయత్నించాను.
కబీరు-11
తన మతం కబీరని విస్పష్టంగా చెప్పినవాడు. నిజమైన సూఫీ. అవధూత. ఆయన పాదాలదగ్గర ఆ పుస్తకం ఆవిష్కరణ కావటం నా భాగ్యం. ఈ పుస్తకం మా హీరాలాల్ మాష్టారికి అంకితమిచ్చాను.
భావన: చలం
రచయితగా మొదలై ఒక మిస్టిక్ గా పరిణామం చెందిన చలంగారి ఆలోచనలను స్మరిస్తూ ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారి సుప్రభాత భావన కోసం వాడ్రేవు చినవీరభద్రుడు చేసిన ప్రసంగం.
