మోహనరాగం: సౌందర్యలహరి

శంకరుల సౌందర్యలహరి ఒక తాంత్రిక కవిత, మాంత్రిక కవిత, మార్మిక కవిత, అన్నీను. ఎందుకో వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.

మోహనరాగం: తిరుప్పావై

నెలకు నాలుగు వానలు కురవాలనీ, ఆ నీళ్ళల్లో మీనాలు నిలువెత్తున ఎగిరి పడాలనీ, పాడిపంటలు పొంగిపొర్లే దేశంలో తాము భగవంతుడితో కలిసి విందు ఆరగించాలనీ కోరుకున్న ఒక అద్వితీయ శుభాకాంక్ష తిరుప్పావై. ఆండాళ్ కవిత్వ విశిష్ఠతను వివరిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.

మోహనరాగం: వసంతఋతువు

ఋతువుల రాణీ వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని వస్తున్నవేళ కవిత్వంలో వసంతఋతువుని వర్ణిస్తున్నారు వాడ్రేవు చినవీరభద్రుడు వరల్డ్ స్పేస్ రేడియో కోసం 'మోహనరాగం' పేరిట 2007 లో చేసిన ప్రసంగంలో.