తెలుగు సాహిత్యానికి అపారమైన సేవచేస్తున్నామని చెప్పుకునే కొన్ని ఎన్నారై సంస్థల వెబ్ సైట్లు కూడా గాలించాను. ఎన్.వి. రమణయ్య అనే పేరు లేకుండానే తమ వేలాది వెబ్ పేజీలు కొనసాగుతుండటం ఎంత సిగ్గుపడవలసిన విషయమో వాళ్ళిప్పటికేనా గ్రహించాలి.
గోపీప్రేమ
బృందావనకృష్ణుడలా కాదు. ఆయన తనలోని ఈ సామాన్య జనపక్షపాతాన్ని వీలైనంత ప్రకటించుకుంటాడు. వివిధ ఆశ్రమాలుగా, వర్ణాలుగా, అంతస్తులుగా, తరతమభేదాలతో చీలి ఉన్న సమాజంలో ముక్తికి అందరికన్నా ఎక్కువ సన్నిహితులు బృందావన గోపికలేనని ఆయన చెప్పడంలోని పరమపురుష తత్త్వాన్ని మనం చూడాలి
