ప్రగాఢ నిశ్శబ్దం

కాని అట్లాంటి కవిత్వాలకీ, అటువంటి జీవితాలకీ ఉన్న ప్రయోజనం అదే. అవి మనల్ని లోకం దృష్టిలో కూరుకుపోకుండా బయటపడేస్తాయి. నువ్వు నీ సంతోషానికి నీ చుట్టూ ఉన్నవాళ్ళ ఆమోదం కోసం వెంపర్లాడకుండా కాపాడతాయి

చిత్రించగల ఆ చేతులు ఎక్కడ ?

ఆ చేతులు ధిక్కరించడానికీ, విలపించడానికీ కూడా చాతకానివి. ఆ చేతులకి మిగిలిందల్లా, ఆ దౌర్భాగ్యక్షణంలో ఒకరినొకరు పట్టుకోవడం, కలిసికట్టుగా మరణించడమే. సర్పక్రతువులో ఒకరినొకరు కావిలించుకుని హోమగుండంలో ఆహూతి కావడానికి వచ్చిపడుతున్న ప్రాణులు తప్ప వారు మరేమీ కారు.

డా. రాధేయ

తన సొమ్ము, తన కష్టార్జితం, తన పిల్లలకోసం దాచివుంచుకోవలసిన డబ్బుతో, ప్రకటనలిచ్చి, కవిత్వసంపుటాల్ని ఆహ్వానించి, న్యాయనిర్ణేతలని వెతికి పట్టుకుని, పుస్తకాలు ఎంపికచేసి, తాను ఎక్కడ పనిచేస్తే అక్కడే సభలు నిర్వహించి, ఆ ఆ కవుల్ని యథాశక్తి సత్కరించి-ఇట్లానే మూడు దశాబ్దాలు గడిపేడు.