ఎర్రక్రీస్తు-1

ఆధునిక తెలుగు కవిత్వం క్రీస్తునొక మానవాతీత ప్రతీకగా చిత్రించడంలో ఆసక్తి చూపించింది. కాని బైరాగి క్రీస్తు జీవితంలోని అశక్తక్షణాల్ని పట్టుకున్నాడు. ఆ అశక్తక్షణాల్లో, క్రీస్తు కూడా మనలానే మామూలు మనిషిగా భావించిన క్షణాల్లో అతడి మనోవేదన ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించాడు.

ఫిన్నిష్ కవయిత్రులు

కవిత్వం రాయడమంటే ఆత్మవిమోచన, సంతోషానుభవం, ఆ కవితలు చివరికి విషాద అనుభవాలనుంచి పుట్టినా సరే. కవిత్వం రాయడం ఒక విజయం. కవిత్వం సంగీతం, ఆనందం. అది మనిషికి శాంతినీ, నూతనజవసత్త్వాల్నీ అందిస్తుంది.

మునిపల్లె రాజు

కవి, కథకుడు, సాహిత్యారాధకుడు, మహామనిషి మునిపల్లె రాజుగారు మొన్న రాత్రి ఈ లోకాన్ని వదిలివెళ్ళిపోయారు. నిన్న ఆయన పార్థివదేహాన్ని దర్శించుకున్నప్పుడు అస్తిత్వనదపు ఆవలితీరానికి చేరుకున్న ఆ మానవుడు నిశ్చింతగా కనిపించాడు.