లక్ష్మణరావుగారు రచయిత, అనువాదకుడు, ఆత్మచరిత్రకారుడు నిజమే కాని,అన్నిటికన్నా ముందు మహామానవుడు. శతాబ్దమంత సుదీర్ఘం, సుసంపన్నం అయిన జీవితం ఆయనది. జగదీశ్ చంద్ర బోస్ దగ్గర వృక్ష శాస్త్ర పరిశోధన చేసినవాడు, మహాత్మాగాంధీ చెంతన సబర్మతిలో ఆశ్రమవాసం చేసినవాడు
సుమనస్వీ, దయాళువూ
ఖురాన్ చెప్పే సమాధానమేమిటంటే, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న రహమత్ వల్లనే , స్వభావరీత్యా రహమత్ సమన్వయకారకం కావడం వల్లనే ఈ విశ్వాన్నీ, విశ్వంలో వ్యాపించి ఉన్న ప్రతి ఒక్కదాన్నీ నడిపించే వ్యూహమంటూ ఒకటి ఉన్నది. అది నిలబెట్టేదిగా ఉంటున్నది.
శయనైకాదశి
కాలపరిభ్రమణంలో, ఋతుసంక్రమణంలో వెలుగు చేసే ప్రయాణాన్ని క్రతువులుగా, పండగలుగా జరుపుకుంటూ రావడంలో మనిషి చేసుకుంటున్న జీవితోత్సవం రూపాలు మారుతున్నదికాని, స్ఫూర్తి ఒక్కలానే కొనసాగుతున్నది
