ఆ వెలుగునీడలు తెలియాలి

బహుశా కథ మొదలయిన తర్వాత, పాత్రలు నా మాట వినకపోవచ్చు. నేనే ఒక ప్రేక్షకుడిలాగా ఆ పాత్రల గమనాన్ని నిశ్చేష్టుణ్ణై చూస్తూండవచ్చు. కాని నాకు తెలియవలసింది, ఆ స్థలం, ఆ కాలం, ఆ వెలుగునీడలు.

శివసంకల్ప సూక్తం

సంకల్పం పరిశుద్ధమైతే, జీవితం పరిశుద్ధమవుతుందని అందరికన్నా ముందు గ్రహించినవాడు వైదిక ఋషి. ఆయన తన తలపులు శివమయం కావాలని కోరుకున్న ఒక సూక్తం 'శివసంకల్ప సూక్తం'

ఋగ్వేదానికే ప్లేటో ఒక ఫుట్ నోట్

ప్లేటో వెనక, ప్లేటో కి నేపథ్యాన్ని సమకూరుస్తూ ఋగ్వేదమున్నది. బహుశా డి నికొలస్ చెప్పే మాటలు నిజమే అనుకుంటే, అనేక పార్శ్వాలకు- లేదా నాలుగు పార్శ్వాలకు -సంబంధించిన దర్శనాన్ని ప్రతిపాదిస్తున్న ఋగ్వేదానికే ప్లేటో, పాశ్చాత్యతత్త్వశాస్త్రమూ కూడా ఫుట్ నోట్స్ గా కొనసాగుతున్నారని చెప్పవలసిఉంటుంది.1