స్వాతంత్ర్య దర్శనం

ఆయన ఆ సందర్భంగా మా వాడితో 'ప్రసిద్ధ జాతీయ నాయకుల గురించి మాట్లాడేవాళ్లూ, వారిని పట్టించుకునే వాళ్ళూ ఎవరో ఒకరు ఉన్నారు. కానీ మీరు ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ విస్మృత వీరుల గురించి మాట్లాడడానికి మీరు తప్ప వాళ్ళకి మరెవరూ లేరు' అన్నారు.

యాభై ఏళ్ళ ప్రయాణం

గాంధీజీ జీవిత విశేషాలను చూపించే ఒక చిత్రపట ప్రదర్శనని తానే స్వయంగా రూపొందించుకున్నాడు. గాంధీజీ వంశ వృక్షం నుంచి ఆయన అంతిమయాత్రదాకా, ఎన్నో అరుదైన ఫొటోలూ, వార్తాపత్రికలూ, స్టాంపులూ, చారిత్రిక పత్రాలూ సేకరించి గాంధీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించే ఒక ఫొటో ఎగ్జిబిషన్ నీ, అది చూపిస్తూ శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఒక కథనాన్నీ తయారు చేసుకున్నాడు.