తృష్ణాత్యాగం అంటే ప్రపంచాన్ని త్యజించడం కాదనీ, జరిగిపోయినవాటిగురించీ, జరగబోయే వాటి గురించీ ఆందోళన వదిలిపెట్టడమనీ ఆయన చెప్తూ ఉంటే అటువంటి సాధన ఏదో మనం కూడా చేపట్టగలమనిపిస్తుంది.
శేష వస్త్రం
ఇది చదివిన తర్వాత, మీ జీవితాల్లో, బాల్యంలోనో, కౌమారంలోనో, నవయవ్వనంలోనో మీమీద ఇట్లా తమ ఆశీర్వాదాన్ని వర్షించిన మహనీయులు, మీ తల్లిదండ్రులో, అక్కచెల్లెళ్ళో, అన్నదమ్ములో, తొలిఉపాధ్యాయులో ఎవరో ఒకరు ఉండి ఉంటారు. వారిని ఒక్కసారి మనసారా స్మరించండి.
ఒక సాధన కథ
ఆయన్ని కలిసి మాట్లాడుతున్నప్పుడూ, ఆ పుస్తకం చదువుతున్నప్పుడూ కూడా నా మనసులో వియత్నమీస్ బౌద్ధ సాధువు థిచ్ నాట్ హన్ నే మెదులుతూ ఉన్నాడు. మోక్షానంద కూడా థిచ్ నాట్ హన్ లానే కవి. ఆయన ప్రయాణం కూడా భావకవిత్వం నుంచి బౌద్ధ కవిత్వం దాకా నడిచిన అన్వేషణ. ఆయన భావుకత్వం తామరపూలు పూసిన కొలనులాంటిది. ఆ వాక్కు శుభ్రవాక్కు. అందులో శుభ్రత, స్వచ్ఛతలతో పాటు, ఒక సౌందర్యపు మిలమిల కూడా ఉంది.