ప్రాచీన గ్రీకు సంస్కృతి పట్ల, దేవతల పట్ల, వారి సౌందర్యోపాసన పట్ల అపారమైన ఆరాధన పెంచుకున్న హోల్డర్లిను తన జీవితంలో కూడా అటువంటి ఒక డయోటిమా కోసం అన్వేషించాడు.
పుస్తక పరిచయం-1
మొన్న ఈ-బుక్ గా విడుదల చేసిన 'ప్రేమగోష్ఠి 'పుస్తకాన్ని పరిచయం చేస్తూ నిన్న పేస్ బుక్ లైవ్ లో ఒక ప్రసంగం చేశాను. మిత్రులు చాలామంది ఆ ప్రసంగం విన్నారు. ఆ ప్రసంగం వినలేకపోయినవారి కోసం దాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ఇదుగో ఇలా మీతో పంచుకుంటున్నాను.
ప్రేమగోష్ఠి-13
తన కాలం నాటి ఏథెన్స్ మానసిక దాస్యాన్ని సోక్రటీస్ కలవపరిచాడనీ, తన రాజకీయ దాస్యాన్ని భరించలేని ఏథెన్స్, తమ మధ్య మానసికస్వతంత్రుడిగా ఉన్న సోక్రటీస్ ని బలిగొన్నదనీ ప్లేటో మరింత సూక్ష్మంగా, మరింత సాహిత్యప్రతిభతో సింపోజియం ద్వారా వివరిస్తున్నాడని మనం గ్రహించినప్పుడు ఈ రచన మరింత ఔన్నత్యాన్ని సంతరించుకుంటుంది.
