విశిష్ట ఉపాదానం

అక్కణ్ణుంచి పాశ్చాత్య విమర్శకులు ముందుకు పోలేకపోయారు. ఎందుకంటే, బోదిలేర్ ఆదిమపాపాన్ని నమ్మినంతగా, భగవదనుగ్రహాన్ని నమ్మినట్టుగా కనిపించలేదు వాళ్ళకి. కాని, పాశ్చాత్య విమర్శకులు ఎక్కడ ఆగిపోయారో, రాధాకృష్ణమూర్తిగారు అక్కణ్ణుంచి మొదలుపెట్టారు.

సమన్వయ శీలి

అలా మనమొక నూతన జీవనశైలిని ఎంచుకుంటున్నప్పుడు, ఆ జీవనవిధానాన్ని మనం విముక్తిదాయకంగా భావిస్తూ ఉండటం అంతకన్నా ముఖ్యమైన కారణం. అలాగని ఆ నవీన జీవనవిధానాన్ని ఎంచుకోకుండా ఉండే అవకాశం కూడా లేదు మనకి. మనం ఆధునీకరణ చెందకతప్పదు. అందుకని మనం చెయ్యగలిగిందల్లా ఒకింత మెలకువతో ఆధునీకరణకు లోనుకావడమే.

గొప్ప పఠనానుభవం

కేవలం 'ఉండటం' దాస్యం. 'జీవించడం' స్వాతంత్య్రం. 'ఉండటం' స్తబ్ధత. 'జీవించడం' చలనం. 'ఉండటం' జడత్వం. 'జీవించడం' స్పందన. ఏది కేవలం 'ఉంటుందో' అది ముడుచుకున్న జీవితం. ఏది 'జీవిస్తుందో' అది తెరుచుకున్న జీవితం.