సుబ్రహ్మణ్యంలో శతాబ్దాల రాజమండ్రి చరిత్ర, సంస్కారం, సంప్రదాయాలు మూర్తీభవించాయని చెప్పటం అతిశయోక్తి కాదు. అంత చిన్న వయసులోనే అతను ఆ నగరానికి తలలో నాలుకగా ఎలా మారగలిగాడో ఇప్పటికీ నా ఊహకు అందదు.
ఆ పల్లె, ఆ యేరు, ఆ పద్యాలు
ఆ పల్లె, ఆ నల్లని యేరు, ఆ పచ్చికబయళ్ళు, ఆ లేగదూడలు, ఆ వల్లెవాటు, ఆ పిల్లనగ్రోవి, ఆ ఓరచూపులు ఆ పింఛం, ఆ ఓరమోము- అబ్బా! ఇది ఏ గుడికి చెందిన కృష్ణుడి గురించిన పద్యం? మా ఊళ్ళో కృష్ణుడికి ప్రత్యేకంగా ఏ గుడీ లేదుగాని, ఆ పల్లె, ఆ ఏరు, ఆ లేగలూ, ఆ నెమళ్ళూ మా ఊరివి కావా!
అమరధామం
నాకు తెలిసినంతమటుక్కి, ప్రపంచ మహానగరాలన్నిటిలో ఒక రాజమండ్రిలోనే ఈ మృత్యుంజయగాథకి మహత్వం సిద్ధించింది.