ప్రేమగోష్ఠి-7

అంటే, సౌందర్యాన్ని కోరుకుంటున్నప్పుడు ప్రేమ మంచితనాన్ని కూడా కోరుకుంటున్నట్టేనా? 'నీ మాటలు ఖండించలేను సోక్రటీస్, సరే, నువ్వన్నట్టే అనుకుందాం' అన్నాడు అగధాన్. 'ప్రియమిత్రమా, నువ్వు చెప్పవలసిన మాట అది కాదు, ఇది: నేను సోక్రటీస్ ని ఖండించగలనేమోగాని, సత్యాన్ని ఖండించలేను'అని చెప్పు.

ప్రేమగోష్ఠి-6

హెసియోదూ, పార్మెనిడిసూ దేవతల కార్యకలాపం గురించి చెప్పినమాటలు నిజమే అనుకుంటే, అవన్నీ దేవతలు అవసరం కొద్దీ చేసినవి తప్ప, ప్రేమతో చేసినవి కావనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రేమదేవత ఉండిఉంటే, దేవతలు సంకెళ్ళలో తగులుకుని ఉండేవారు కాదు, వికృతరూపులయ్యేవారు కాదు. లేదా ఇంకా అలాంటివే హింసాత్మక చర్యలుండేవి కావు. వాటి బదులు,  ప్రేమ సామ్రాజ్యం మొదలయ్యాక ఇప్పుడు స్వర్గంలో కనవస్తున్నట్టే, అప్పుడు కూడా శాంతీ, మాధుర్యమూ వెల్లివిరిస్తూ ఉండేవి.

ప్రేమగోష్ఠి-5

ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా మనుషులు లైంగికంగా రెండువిధాలుగా ఉండేవారు కాదు. మూడు విధాలుగా ఉండేవారు. పురుషుడు, స్త్రీ, వారిద్దరూ కలిసి ఉండే మరొక రూపం. ఒకప్పుడు అస్తిత్వంలో ఉండి, ఇప్పుడు కనుమరుగైన, ఆ మిథున రూపాన్ని స్త్రీ-పురుషమూర్తి అని పిలిచేవారు. ..

Exit mobile version
%%footer%%