దక్షిణమారుతం తాకినట్లుగా

కాని ఆ మొక్కకి బతకాలన్న కోరిక చాలా ప్రగాఢంగా ఉంది, కాబట్టే అది మరణం అంచులనుంచి వెనక్కు వచ్చింది. వాననీటికి కొట్టుకొచ్చిన మట్టి దాని వేళ్ళ చుట్టూ పోగవడంతో అది మళ్ళా బలం పుంజుకుని పైకి లేచింది, వేళ్ళూనుకుని పువ్వు పూసింది