ఆంధ్రకవితాపితామహుడు

ఆ నవపారిశ్రామిక పట్టణమధ్యంలో పెద్దన విగ్రహం నాకు చాలా incongruous గా కనిపించింది. అది ధన్ బాద్ బొగ్గు గనుల మధ్య టాగోర్ ని చూసినట్టు ఉంది. ఉత్తర జర్మనీలో రూర్ ప్రాంతంలో గొథేని కలుసుకున్నట్టు ఉంది.

ఏ విహంగము గన్న

అనువాదం చేసినప్పుడు కవిత్వంలో నష్టపోనివాటిల్లో మొదటిది మెటఫర్ అయితే, తక్కిన రెండూ, భావమూ, ఆవేశమూనూ. భావాన్ని మూడ్ అనవచ్చు. మనం భావకవిత్వంగా పిలుస్తున్నది మనకి విమర్శకులు చెప్పినట్టు రొమాంటిసిస్టు కవిత్వం ప్రభావం వల్ల రాసిన కవిత్వంకాదు.