సాయంకాలమంతా గడిపాక 'ఇక వెళ్ళొస్తాన' ని తన ఇంటికో, గదిలోకో, తనుండే ఊరికో వెళ్ళినట్టే వెళ్ళిపోయాడతడు, మరేమీ చెప్పకుండా వదిలి ఉంచకపోయినా ఏ సంకేతాలూ.
సత్యశోధన
రెండురోజులకిందట గాంధీజీ ఆత్మకథ గురించి నాలుగు వాక్యాలు రాయకుండా ఉండలేకపోయానేగాని, నిజానికి ఆ పుస్తకం గురించీ, గాంధీజీ జీవితం గురించీ నా మనసులో కదలాడుతున్న భావాలన్నిటికీ నేను అక్షరరూపం ఇవ్వలేకపోయాను.