ఒక ఆంతరంగిక సమాధానం

ఈ లోకంలో నేను కూరుకుపోకుండా, ఇక్కడి శక్తులకీ, వస్తువులకీ బానిసని కాకుండా ఉండగలిగానంటే, ఈ సముద్రం ఒడ్డున ఒక పడవలాగా ఆ శ్లోకసారాంశం నా మనసులో నిలిచిపోవడమే కారణమనుకుంటాను.

సర్వజ్ఞ వచనాలు

గురజాడలాగా సర్వజ్ఞుడు కూడా పాడిపంటలు పొంగిపొర్లే దేశాన్ని కోరుకున్నాడు. ఆయన కలగన్న స్వర్గం సరళం, ఐహికం, స్వాభావికం. సకాలంలో కురిసే వాన, చక్కగా పండే పొలం, మనసు కలిసిన ఇల్లాలు, తనతో అమరిక కుదిరిన బిడ్డలు, ఆదరంతో చేరవచ్చే ఇరుగుపొరుగు-ఇంతే ఆయన కోరుకున్న లోకం. ఆకలి వేస్తే దొరికే అన్నం, నెమ్మదిగా సాగే వేసవి, నిండువెన్నెల రాత్రి, ఇవే ఆయన కోరుకున్న భోగం

మూర్తీభవించిన వర్ష ఋతువు

వర్షర్తు వర్ణన పద్యాలన్నీ వర్ణచిత్రాలు. ఆయన ఒక కవిగా కాక, ఒక చిత్రకారుడిగా ఆ పద్యాలు నిర్మించాడు. అందులో కొన్ని కుడ్యచిత్రాలు, కొన్ని తైలవర్ణ చిత్రాలు, కొన్ని నీటిరంగుల చిత్రాలు.కాని, ఆ రంగులు మామూలు రంగులు కావు. ఎంతకాలం గడిచినా వన్నె తగ్గని రంగులు. ఆ మాటలపొందికలో కనిపించే ఆ మెరుపు అటువంటిది.

Exit mobile version
%%footer%%