ఆషాఢమేఘం-12

కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.

విషాదమధుర వాక్యం

నా మానాన నా ఉద్యోగమేదో చేసుకుంటున్న నన్ను ఎంకి ఒక్కసారిగా చెదరగొట్టేసింది. ఇప్పుడు నాకు ఎన్నెలంతా నెమరేసిన ఆ యేరు, ఆ కొండ, ఆ తెల్లవారు జామున తేనెరంగు తిరిగే నెలవంక, గాలికి కూడా చోటివ్వని ఆ కౌగిలి- ఇవి కావాలనిపిస్తున్నది. అన్ని పనులూ పక్కన పెట్టేసి, ఇదిగో, ఈ పాట పదే పదే హమ్ చేయాలనిపిస్తున్నది:

కారుమబ్బులబారు

ముఖ్యంగా, ప్రతి శ్రావణమాస మధ్యంలోనూ ఒక్కసారేనా గుర్తొస్తుంది ఈ పద్యపాదం 'అసలు శ్రావణమాస మధ్యమ్మునందు కురిసితీరాలి వర్షాలు కొంచెకొంచెమేని మేని రాలాలి తుంపరలేని..'