అభినందనలు

. ఈ దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి కావాలనీ, హింసతో నిమిత్తం లేకుండా సమానతను సాధించగలగాలనీ, ద్వేషపూరితమైన నేటికాలంలో నిజమైన శాంతిఖండంగా విలసిల్లాలనీ మనం కోరుకుంటున్నాం. ఆ కోరిక చాలు. మనల్ని ముందుకు నడిపించడానికి.

సంకల్పం చెప్పుకుందాం

అక్కడ 'ఇండియన్ ' అనే పదం మూఢ జాతీయతని కాదు, ఉజ్జ్వలమైన బృంద స్ఫూర్తిని స్ఫురింపచేస్తున్నది. అక్కడ ఇండియా ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒకే ఒక్క మతం అంతకన్నా కాదు. అక్కడ ఇండియా ఒక టీం, ఒక ఉమ్మడి భావన, వ్యక్తి తనని తాను వెనక్కి నెట్టుకుని తనొక బృందంగా మారే క్రమశిక్షణ, సంస్కారం, సంస్కృతి.