మోహనరాగం: పోస్టు చెయ్యని ఉత్తరాలు

ఆధునిక తెలుగు సాహిత్యంలో తాత్త్విక ధోరణులకు తలుపులు తెరిచిన వాడు త్రిపురనేని గోపీచంద్. ఆయన రాసిన పోస్టు చెయ్యని ఉత్తరాలను వివరిస్తూ 'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.

దృక్పథం ఒకరిస్తే ఏర్పడేది కాదు

వారం పదిరోజుల కిందట నాకో యువకుడు పోన్ చేసాడు. 'మీకు నేను ఏడెనిమిదేళ్ళ బట్టీ ఫోన్ చెయ్యాలనుకుంటున్నాను. ధైర్యం చాలింది కాదు. ఈ నంబరు నా దగ్గర చాలా ఏళ్ళుగా ఉంది. కాని ఇప్పటికి మీతో మాట్లాడ గలుగు తున్నాను' అన్నాడు.