మూడు పాటలు

ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్ పుస్తకం చూడగానే ఈ జ్ఞాపకాలు మనసులో మెదలడంతో కలిగిన బెంగ కొంతమాత్రమే. కాని అసలు సోవియేట్ ప్రయోగమే నా హృదయాన్ని కలచివేసింది. ఇరవయ్యవశతాబ్దం చూసిన మహత్తర మానవసామాజిక ప్రయోగాల్లో సోవియెట్ రష్యా ఆవిర్భావం కూడా ఒకటి.