స్మృతిగా, స్వప్నంగా, ఊహగా

ఇప్పుడామె కవిత్వం మనం చదువుతూన్నప్పుడు మనం కూడా మన మౌలిక కౌటుంబిక అనుబంధాల్ని వంచనా రహితంగా పరికించుకోకుండా ఉండలేం. అందుకనే ఆమె మనకి అత్యంత ఆత్మీయురాలిగా గోచరిస్తూ ఉన్నది.