ఫిబ్రవరి. ఈ నెలంతా అమెరికాలో, కెనడాలో 'నల్లజాతి చరిత్ర మాసోత్సవం' జరుపుతారు. ఫిబ్రవరి 12 న అబ్రహాం లింకన్ జయంతిని, 14 న నల్లజాతి స్వాతంత్ర్యనేత ఫ్రెడరిక్ డగ్లస్ జయంతిని, పురస్కరించుకుని 1926 లో నీగ్రో చరిత్ర వారోత్సవంగా మొదలైన ఈ వేడుక 1976 నుంచీ Black History Month గా జరుపుతున్నారు.