ఆ కథ చెహోవ్ కథాశిల్పానికి పరిపూర్ణమైన నమూనా. అందుకనే రష్యను సాహిత్యం మీద తాను చేస్తున్న ప్రసంగాల్లో భాగంగా చెహోవ్ గురించి చెప్పేటప్పుడు వ్లదిమీరు నబకొవు ఈ కథ గురించే చాలా వివరంగా విశ్లేషించాడు. ఈ కథ ఆధునిక కథాశిల్పానికి ఒక టెక్స్టుబుక్కు ఉదాహరణ.
ఆంటోన్ చెకోవ్ కథలు-2
ఒకప్పుడు రష్యాలో ఇటువంటి కాలాన్ని ధిక్కరిస్తో ఒక టాల్ స్టాయి, ఒక చెకోవ్, ఒక గోర్కీ వంటి వారు రచనలు చేసారు. కాని మన దేశంలో ఇప్పుడు అటువంటి రచయితలు కనబడకపోగా కనీసం అటువంటి రచయితలు అవసరమని నమ్మేవాళ్ళు కూడా కనిపించట్లేదు.
కథల సముద్రం-2
ఈ అపురూపమైన సాహిత్యభాండాగారాన్ని తెలుగులోకి తీసుకురావడానికి పూనుకున్న కుమార్ కూనపరాజుగారికి తెలుగు సాహిత్యలోకం సదా ఋణపడి ఉంటుంది. ఇప్పటికే డాస్టొవిస్కీ రాసిన కరమజోవ్ సోదరులు నవలను ప్రశంసనీయంగా అనువాదం చేసిన అరుణా ప్రసాద్ ఈ కథల్ని అనువదించడం తెలుగు కథకులకు ఊహించని వరం.
