ఉత్తమ తెలుగు వాన కథలు

తక్కిన ప్రపంచమంతా తనని తాను కులాల, మతాల, సిద్ధాంతాల గొడుగుల్తో మానవతావర్షధారలనుంచి అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు కథకుడొక్కడే ఆ వానలో అమాయికంగానూ, సాహసంగానూ ముందడుగు వేస్తున్నాడు.

స్వర్ణ యుగద్వారం

పదిహేడేళ్ళ బాలిక రాసిన ఆ నాలుగు కవితలూ చదవగానే నాకొక సారి మళ్ళా ఏ గ్రీకు సముద్రతీరంలోనో, ఏ పార్థెనాన్ మంటపం దగ్గరో, ఏ ఒలింపియా ప్రాంగణంలోనో తిరుగుతున్నట్టు అనిపించింది. ఆ ఇంగ్లీషు మామూలు ఇంగ్లీషు కాదు, ఆ భాషని అంటిపెట్టుకున్న క్లాసికత నన్నాశ్చర్యపరిచింది.

బరంపురంలో

లక్ష్మణరావుగారు రచయిత, అనువాదకుడు, ఆత్మచరిత్రకారుడు నిజమే కాని,అన్నిటికన్నా ముందు మహామానవుడు. శతాబ్దమంత సుదీర్ఘం, సుసంపన్నం అయిన జీవితం ఆయనది. జగదీశ్ చంద్ర బోస్ దగ్గర వృక్ష శాస్త్ర పరిశోధన చేసినవాడు, మహాత్మాగాంధీ చెంతన సబర్మతిలో ఆశ్రమవాసం చేసినవాడు