నేలకొండపల్లి-3

నేలకొండపల్లి వెళ్ళి వచ్చినప్పటినుంచీ ఈ వారం రోజులూ నా ఆలోచనల్లో రామదాసే ఉన్నాడు. రామదాసు కీర్తనల్లో ప్రధానమైంది ఆర్తి. అది ఆయన జైల్లో ఉండగా రాసిన పాటల్లో మరీ మరీ వినిపిస్తుంది. కాని అంతకన్నా ముందటి పాటల్లో ఉండేది ఉత్సాహం.