ఫాల్గుణమాసంలో రంజాన్

తెల్లవారుతూనే ఈ చెట్టు రోడ్డుమీదకీ
వలపన్ని కూచుంటుంది. చాలాకాలం
పాటు వెతుక్కునేవాణ్ణిందులో, కొండలూ
కోనలూ, నా చిన్నప్పటివి, చిక్కుతాయని.

ఇప్పుడు నా దృష్టి గతాగతాలమీద లేదు.
పరికిస్తున్నాను ఆ ఆకుపచ్చని వలని,
దాని కంతల్లోంచి కారిపోతున్న వెలుగుని,
దానిలోపల చిక్కబడుతున్న దగ్గరితనాన్ని.

రోజంతా ఆకాశం మీద వలలు విసిరాక
సాయంకాలానికి ఈ ఋతువు పోగేసుకునేది
ఉపవాసదీక్ష ముగించేవేళల నిశ్శబ్దం.
దానికి నిన్నటి చింత లేదు, రేపటి ధ్యాసలేదు.


Iftar photography: Samacharam Ravi

13-3-2026

3 Replies to “ఫాల్గుణమాసంలో రంజాన్”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading