చాలా రోజులుగా మనసులో
ఒక వాక్యం మెదుల్తోంది-
ఈ లోకం ఒక నీడ అని.
అందుకనే కాబోలు
అది నన్ను చేరదీసుకున్నా
నేను దాని చెంతకు చేరినా
ఇట్టే జారిపోతుంది.
చూడవలసిందీ
చేరవలసిందీ
వెలుగుని-
నీడని కాదు.
Featured image: Photography by Jay Brand via pexels.com
26-11-2025

Lovely sir. ❤️❤️
మీరు స్పందించాక కవిత పూర్తవుతుంది.
“మనసులో ఒక వాక్యం” మెదులుతూ వుండడం 🙏🏼
ధన్యవాదాలు మాధవీ!
కాంతికిఎదురుగ ఉన్నప్పుడు మన నీడ అయినా మనకు కనిపించదుగా? కాంతి కి దూరంగా జరిగినప్పుడు మాత్రమే మన నీడ మనకు కనిపిస్తుంది .నీడకు స్వతః సిద్ధమైన ఉనికి లేదు . అంటే మీరు వెలుగు లో ఉన్నారనే కదా అర్థం.
( దీని మీద ఒక కథ రాసేసాను సర్. బహుమతి కూడా అందుకున్నాను. )
సర్. మీరే ఒక వెలుగు. ఇది నిజం.
హృదయపూర్వక నమస్కారములు.
లోకం నీడైతే
వెలుగు ఈ భూమి నా?
మీ హృదయాన్నీ, నా హృదయాన్నీ కలిపేది. మీరూ, నేనూ ఒకరినొకరు చూసుకోక పోయినా, కలుసుకోకపోయినా, ఒకరికొకరు గుర్తు రాగానే మన హృదయంలో కదిలే మెదిలే ఒక సాత్విక సుకుమార భావన. అది ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. కానీ అది లేకుండా మనుషులు కలుసుకున్నా, చూసుకున్నా ఉపయోగం లేదు.
ఎంత బాగా చెప్పారు. సాత్విక సుకుమార భావన. సర్. నమోనమః
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం
నిజం 💚