స్వాధ్యాయ-కోవెల యూ ట్యూబు ఛానలు తరఫున కస్తూరి మురళీకృష్ణగారు, కోవెల సంతోష్ కుమారు గారు నాతో చేపట్టిన సంభాషణల్లో మరొక భాగం ఇక్కడ వినవచ్చు.
పుస్తక పరిచయం-26
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా ఈ రోజు మేఘసందేశం కావ్యంలోని 28-32 శ్లోకాల గురించి ప్రసంగించాను. గ్రామీణ పట్టణ సంస్కృతుల మధ్య మేఘసందేశం ఒక రససేతువుని ఏ విధంగా నిర్మించిందో కొన్ని ఊహలు చేసాను. ఆ ప్రసంగాన్ని ఇక్కడ వినవచ్చు.
మనసున మనసై
అయితే అది పెళ్ళికానుక కాబట్టి విస్తృతపాఠకలోకానికి అందుబాటులో లేకుండా ఉండిపోయింది. అదీ కాక, ఆ పుస్తకం ఎ-4 సైజులో ఉండటంతో అది పాఠకసన్నిహితం కాదు. అందుకని ఆ పుస్తకాన్ని ఇప్పుడిలాగ ఎ-5 సైజులో రీడిజైను చేసి మీతో పంచుకుంటున్నాను.
