
తెలుగుకథల మీదా, నవలలమీదా, తెలుగులో వచ్చిన అనువాదాల మీదా 2019 నుంచి రాస్తూ వచ్చిన 37 వ్యాసాలతో వెలువరిస్తున్న సంపుటం ఇది. తెలుగు సాహిత్యంలో ఇంతదాకా అప్రధానీకరణకు గురైన కళింగాంధ్ర గిరిజనులు, రాయలసీమ రైతులు, తెలంగాణా ముస్లింలు ప్రాతినిధ్యం పొందిన రచనల గురించిన విశ్లేషణ ఇది. అలానే గతంలో గొప్ప రచనలు చేసి విస్మృతికి గురైన తెలుగు నవలారచయిత్రుల గురించీ, రావిశాస్త్రి వారసుల గురించీ, గ్రీన్ రివల్యూషను నుంచి గ్లోబలైజేషను దాకా గోదావరి డెల్టాలో సంభవించిన సామాజిక పరిణామం గురించీ కూడా ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. ప్రపంచ కథకులందరికీ మార్గదర్శి అని చెప్పదగ్గ చెహోవ్ పైనా, అగ్రశ్రేణినవలల్లో ఒకటైన బ్రదర్స్ కరమజోవ్ పైనా వ్యాసాలు ఈ సంపుటికి ప్రత్యేక ఆకర్షణ. దీన్నిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
పూజ్యులు, కీర్తిశేషులు మునిపల్లె రాజుగారి స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.
ఇది నా 63 వ పుస్తకం.
25-5-2025
అభినందనలండీ! 🌹
ధన్యవాదాలు
శుభాకాంక్షలు అభినందనలు సార్
ధన్యవాదాలు సార్
మీ సాహిత్యం సేవ అనన్య సామాన్యం.
వందో పుస్తకం రావడానికి ఇంకెంతో సమయం పట్టదు.
హృదయ పూర్వక అభినందనలు సార్.
ఇంత అపురూపమైన, విలువైన, అమూల్యమైన గ్రంధాలను మాకు ఉచితంగా పంచుతున్నందుకు మీకు కృతజ్ఞతలు సర్ 🙏🙏❤️